Site icon NTV Telugu

Rakul : ఆస్తులన్ని తాకట్టు పెట్టిన ఫలితం లేకుండా పోయింది.. అంటున్న ర‌కుల్ భ‌ర్త

Rakul

Rakul

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. అనతి కాలంలోనే తన అందం నటనతో మంచి గుర్తింపు సంపాదించుకుని దాదాపు అందరు స్టార్ హీరోలతో జతకటి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. కానీ ఎక్కువ కాలం మాత్రం నిలుపుకోలేక పొయింది. అనంతరం తెలుగులో అవ‌కాశాలు త‌గ్గాక బాలీవుడ్ చెక్కేసింది. ఇక అక్కడ ఆడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తూ.. త‌న స్నేహితుడు జాకీ భ‌గ్నానిని వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక కూడా వీరి లైఫ్‌లో ఎలాంటి మార్పు లేదు. ఇదిలా ఉంటే తాజాగా ర‌కుల్ భర్త జాకీ భ‌గ్నాని ఓ ఇంటర్వ్యూలో పాల్గోని చేసిన కామెంట్స్ ప్రజంట్ వైరల్ అవుతున్నాయి..

Also Read: Taapsee : ఇలాంటి ఓ రోజు వస్తుందని నాకు ముందే తెలుసు..

జాకీ నిర్మాత‌గా.. బాలీవుడ్ అగ్ర నటులు అక్షయ్‌కుమార్‌, టైగర్‌ ష్రాఫ్ ప్రధాన పాత్రలో ‘బడే మియా ఛోటే మియా’ అనే భారీ బ‌డ్జెట్ చిత్రం నిర్మించిన విషయం తెలిసిందే. కానీ గత ఏడాది వేసవిలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. అయితే తాజాగా ఈ మూవీ డిజాస్టర్ పై జాకీ స్పందించాడు.. ‘ ‘బడే మియా ఛోటే మియా’ మూవీ విషయంలో నేను ఇప్పటికి కోలుకోలేక పోతున్న. దీని కోసం ఆస్తులు సైతం తాకట్టు పెట్టాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.. నాకు జీవితంలో ముఖ్యమైన గుణ‌పాఠం నేర్పింది. ఒక ప్రాజెక్ట్‌ని భారీ స్థాయిలో నిర్మిస్తే స‌రిపోద‌ని, మూవీ రిలీజ్ అయ్యాక అర్ధమైంది. మా క‌థ‌తో ప్రేక్షకులు ఎందుకు కనెక్ట్ కాలేక‌పోయార‌నే దానిపై నాకు కోపం లేదు. ఎందుకంటే ప్రేక్షకుల నిర్ణయం నా మూవీ విషయంలో స‌రైన‌దే కావ‌చ్చు, వారిని త‌ప్పు ప‌ట్టలేం. దీనిని ఒక పాఠంగా స్వీకరించి ఇలాంటి పొరపాట్లు మళ్ళి జరగకుండా జాగ్రత్త పడతాను. లాభాలు ఆర్జించాల‌నే ఉద్దేశంతో చిత్రం తీసాం.. కాని అనుకున్న ల‌క్ష్యం చేరుకోలేక‌పోయాం’ అంటూ ఎమోషనల్ అయ్యాడు.

Exit mobile version