NTV Telugu Site icon

Getup srinu : రాజుయాదవ్ ఓటీటీ స్ట్రీమింగ్..ఎప్పుడు ఎక్కడ..?

Untitled Design (28)

Untitled Design (28)

జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న హాస్య నటుడు శ్రీను. వివిధ గెటప్స్ తో ప్రేక్షకులను నవ్వించి మెప్పించి గెటప్ శ్రీనుగా, బుల్లితెర కమల్ హాసన్ గా పేరు సంపాదించాడు. ఒకవైపు టీవీ షోలు చేస్తూనే స్టార్ హీరోల చిత్రాలలో హాస్య నటుడిగా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు గెటప్ శ్రీను. స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తూ హీరోగా సినిమాలు చేస్తున్నాడు.

ఆ ప్రయత్నాలలో భాగంగా టాలీవుడ్ లో తన మొదటి సినిమాగా “రాజు యాదవ్” చిత్రంలో నటించాడు. ఈ చిత్రానికి కృష్ణమాచారి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో గెటప్ శ్రీను సరసన అంకిత అనే భామ తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయం అయ్యింది.
may 24న తెలుగు రాష్టాలలో థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. థియేటర్ రన్ ముగిసే నాటికి డిజాస్టర్ గా మిగిలింది.

విడుదలైన నెల రోజులకు ఏ చిత్రాన్ని అయినా స్ట్రీమింగ్ చేసే ఓటీటీ సంస్థలు రాజు యాదవ్ రిలీజ్ అయి రెండు నెలలు కావొస్తున్న స్ట్రీమింగ్ చేయలేదు. చాల రోజుల తర్వాత తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఆహా రాజు యాదవ్ చిత్రాన్ని ఈ నెల 24నుండి స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ప్రకటించింది. యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన రాజు యాదవ్ రాజేష్ కల్లేపల్లి, ప్రశాంత్ రెడ్డి లు నిర్మాణం వహించగా, యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్షన్ రామేశ్వర్ సంగీతం వహించారు. నేటి నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న రాజు యాదవ్ ను ఓసారి పలకరించండి.

Also Read: Balayya : నందమూరి మోక్షజ్న మెకోవర్ వీడియో..నెట్టింట వైరల్.!

Show comments