Rajugani Saval: ఆసక్తికరంగా “రాజు గాని సవాల్” ట్రైలర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లెలిజాల రవీందర్, రితికా చక్రవర్తి హీరో హీరోయిన్ లుగా నటిస్తున్న సినిమా “రాజు గాని సవాల్”. ఈ చిత్రాన్ని లెలిజాల కమల ప్రజాపతి సమర్పణలో, ఎల్ ఆర్ ప్రొడక్షన్ బ్యానర్ పై లెలిజాల రవీందర్ నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్టు 8న శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. శుక్రవారం “రాజు గాని సవాల్” సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ డింపుల్ హయతి, రాశీ సింగ్, తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షులు భారత్ భూషణ్, ప్రొడ్యూసర్స్ దామోదర ప్రసాద్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, ప్రసన్నకుమార్, గీత రచయిత గోరటి వెంకన్న, నటుడు డా.భద్రం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
Also Read : Nagpur: మాజీ భార్యకు భరణం చెల్లించేందుకు దొంగగా మారిన భర్త..
Also Read
ఈ సందర్భంగా దర్శక నిర్మాత, హీరో లెలిజాల రవీందర్ మాట్లాడుతూ మా జీవితాల్లో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ ను ఆధారంగా చేసుకుని రూపొందించిన చిత్రమిది. సహజంగా ఉండేందుకు కవాడిగూడ రియల్ లొకేషన్స్ లో షూటింగ్ చేశాం. మధ్య తరగతి వారి జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. అలాంటి సందర్భంలో ఒక పెద్ద సమస్య ఎదురైతే ఆ మిడిల్ క్లాస్ పర్సన్ ఎలా ఎదుర్కొన్నాడు అనేది ఈ చిత్రంలో చూస్తారు. ఫ్యామిలీ బాండింగ్స్, స్నేహితుల మధ్య ఉండే అనుబంధాలను ఆకట్టుకునేలా తెరకెక్కించాం. సినిమా టెక్నికల్ గా క్వాలిటీగా ఉండాలని టాప్ టెక్నీషియన్స్ ను పెట్టుకున్నాం. యశ్వంత్ నాగ్ గారి మ్యూజిక్ లో రామ్ మిరియాల, అనురాగ్ కులకర్ణి, గోరటి వెంకన్న వంటి సింగర్స్ మా మూవీలో సాంగ్స్ పాడారు. ఈ సినిమా చూశాక మా టీమ్ కు కెప్టెన్ వంటి బాపిరాజు గారు “రాజు గాని సవాల్” సినిమా క్లాసిక్ డ్రామాగా మ్యూజికల్ హిట్ అవుతుందని చెప్పారు. ఆయన మాట నిజం కావాలని ఆశిస్తున్నా. అన్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!