సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల జైలర్ సూపర్ హిట్ వింటేజ్ రజినీ పవర్ ఏంటో చూపించాడు. వరల్డ్ వైడ్ గా రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టి ఇప్పటి జనరేషన్ హీరోలకి సవాల్ విసిరాడు రజనీకాంత్. తెలుగులో జైలర్ అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. 73 ఏళ్ల వయసులో సూపర్ స్టార్ జైలర్ తో బాక్సాఫీస్ వద్ద చెలరేగాడు. జైలర్ కు ముందు వరుస ఫ్లాప్ లు వచ్చిన కూడా ఒక్క హిట్ తో తన మార్కెట్ చెక్కు చెదరలేదని నిరూపించాడు.
కాగా రజనీ తదుపరి లైనప్ చుస్తే ఆశ్ఛర్యం కలుగక మానదు. ప్రస్తుతం వెట్టయాన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి టిజె జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నాడు. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఒక వైవు ఆ చిత్రం షూటింగ్ లో పాల్గొంటూనే సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ చిత్రంలో నటిస్తున్నాడు రజని. కూలీ చిత్రాన్నిసమ్మర్ కానుకగా విడుదలకు షూటింగ్ చక చక చేస్తున్నారు. వీటితో పాటు జైలర్ సిక్వెల్ ‘హుకుమ్’ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సూపర్ స్టార్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలోనే మొదలెట్టనున్నాడు రజినీకాంత్. ఈ మూడు చిత్రాలతో పాటుగా మారి సెల్వరాజ్ కథచర్చలు చేస్తున్నారు తలైవా. ఈ చిత్రం కూడా ఆల్మోస్ట్ ఓకే అయిందని త్వరలోనే అధికరాకంగా ప్రకటిస్తారని తెలుస్తోంది.
ఇలా వరుసగా గ్యాప్ లేకుండా 4సినిమాలను సెట్స్ పైకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తూ ఇప్పటి తరం హీరోలకు ఛాలెంజ్ విసురుసుతున్నాడు తమిళ్ తలైవా.
Also Read :OTT : మరొక ఓటీటీలో విడుదల కానున్న సత్యభామ..ఎక్కడంటే..?