సూపర్ స్టార్ రజినీకాంత్ మళ్లీ మాస్ మోడ్‌లోకి రాబోతున్నారు. ఆయన నటిస్తున్న తాజా సినిమా ‘కూలీ’ ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాకుండా అంతర్జాతీయంగా కూడా టాప్ ట్రెండింగ్ మూవీలలో ఒకటిగా నిలుస్తోంది. ఈ సినిమాను లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడని ప్రకటించిన నాటి నుంచే అభిమానుల్లో ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమాపై ప్రస్తుతం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లోనూ పాజిటివ్ హైప్ ఉంది. ముఖ్యంగా రజినీ అభిమానులు తమ అభిమాన నటుడిని మళ్లీ యాక్షన్ గెటప్‌లో చూడబోతున్నారని తెగ ఉత్సాహపడుతున్నారు. ఇక రజినీకాంత్ తో పాటు ఉపేంద్ర, నాగార్జున, శ్రుతి హాసన్ వంటి టాప్ స్టార్లు ప్రధాన పాత్రల్లో నటిస్తుండటంతో మల్టీ స్టారర్ మేజిక్ వర్క్ అవుతుందనే నమ్మకం తో మేకర్స్ ఉన్నారు.
Also Read : Chiranjeevi : ‘విశ్వంభర’ గ్రాఫిక్స్ ఔట్‌పుట్‌పై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..
సినిమాకు యువ సంగీత సంచలనం అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటంతో ఆల్బమ్‌పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సింగిల్స్, బిజెఎంలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మేకర్స్ ఇచ్చిన అప్‌డేట్ ప్రకారం, అమెరికాలో ‘కూలీ’ అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ జూలై 24 నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అక్కడ రజినీకాంత్ ఫ్యాన్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే అక్కడి డిస్ట్రిబ్యూటర్లు భారీ స్క్రీన్ కౌంట్‌తో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కాగా ఈ మాస్ యాక్షన్ బ్లాస్టర్‌ను మేకర్స్ ఆగస్టు 14న గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ఇండిపెండెన్స్ డే (ఆగస్టు 15) సమయం కావడంతో ఓపెనింగ్స్ పరంగా సాలిడ్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
