ఇండస్ట్రీ ఏదైనప్పటికి యాక్షన్ చిత్రాలకు ఉండే క్రేజే వేరు. సరైన యాక్షన్ కంటెంట్ ఫిల్మ్ పడితే.. రికార్డులు బద్దలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడలాంటి యాక్షన్ చిత్రాలు కన్నడ నుంచి అధికంగా ఎక్కువగా వస్తున్నాయి. ఈ కోవలోనే వచ్చి తెలుగులోనూ ప్రజాదరణ పొందుతున్నయాక్షన్ కింగ్ వారసుడు, కన్నడ స్టార్ ధృవ సర్జా హీరోగా తెరకెక్కిన వయోలెంట్, యాక్షన్ చిత్రం ‘కేడీ ది డెవిల్’. ‘యూఐ’ మూవీ ఫేమ్ రేష్మ నానయ్య కథానాయికగా నటించగా సంజయ్ దత్, రమేశ్ అరవింద్ , శిల్పా శెట్టి కీలక పాత్రల్లో నటించారు. తాజాగా నేడు(శుక్రవారం) ఈ చిత్రం టీజర్ విడుదల చేశారు.
Also Reade : Coolie : ‘కూలీ’ టికెట్ బుకింగ్స్‌కు డేట్ లాక్..!
అయితే ఈవెంట్‌లో సౌత్ ఇండస్ట్రీలో విలన్ పాత్రల్లో దుమ్ములేపుతున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ రిపోర్టర్ సంజయ్ దత్‌ను ‘ఇక్కడి నుంచి మీ ఇంటికి ఏం తీసుకెళ్తారు?’ అని అడగ్గా.. ఆయన తనదైన శైలిలో ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ‘ఇక్కడి నుంచి మంచి సినిమాలు చేయాలనే ప్యాషన్‌ను నేను బాలీవుడ్‌కి తీసుకెళ్తాను. గతంలో బాలీవుడ్‌కి కూడా మంచి సినిమాలపై ప్యాషన్ ఉండేది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ కేవలం కలెక్షన్లు, నంబర్లపై మాత్రమే దృష్టి పెడుతున్నారు. అయితే ఇక్కడ (సౌత్ ఇండస్ట్రీలో) ఇప్పటికీ ఆ ప్యాషన్ కనిపిస్తుంది. అందుకే నాకు ఇక్కడ పని చేయడం చాలా ఆనందంగా ఉంది’ అని సంజయ్ వ్యాఖ్యానించారు. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్‌కి సరైన హిట్లు లేకపోవడం, ప్రేక్షకులు సౌత్ సినిమాల వైపు మొగ్గుచూపడం అనేది స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి కారణం కంటెంట్‌తో పాటు, కథపై, నిర్మాణ విలువలపై ఉన్న ప్యాషనేనని అంటున్నారు. సౌత్ ఇండస్ట్రీ – ముఖ్యంగా తెలుగు సినిమాలు – ప్యాషన్, డెడికేషన్, టెక్నికల్ స్టాండర్డ్స్ విషయంలో ఒక కొత్త ప్రమాణంగా మారాయి. ఇది చూసిన బాలీవుడ్ ప్రముఖులు కూడా ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీ తో కలిసి పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సంజయ్ దత్ ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో తన మార్క్ వేసే పాత్రలు చేస్తున్నారు. ‘కేజీఎఫ్ 2’లో అధీరా పాత్రలో విపరీతమైన ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ‘KD – The Devil’ లో కూడా పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని కన్నడ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ప్రేమ్ తెరకెక్కి స్తుండగా, పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయనున్నారు.
