NTV Telugu Site icon

వివేక్ మృతికి సంతాపం తెలిపిన రజినీకాంత్

Rajinikanth's condolence on Vivek's death

ప్రముఖ నటుడు తమిళ నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారుజామున 4.35 గంటలకు కన్నుమూశారు. నిన్న గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. డాక్టర్లు వైద్యం అందిస్తుండగానే ఆయన పరిస్థితి విషమించి ఈ రోజు ఉదయం వివేక్ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. వివేక్ ఆకస్మిక మృతి సినిమా ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సెలెబ్రిటీలు ట్వీట్లు చేస్తున్నారు. వివేక్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని, ఆయన చనిపోవడం బాధాకరమని, షాకింగ్ గా అనిపిస్తోందని సమంత అక్కినేని, ఏఆర్ రెహ్మాన్, దర్శకుడు అట్లీ, జెనీలియా, గిబ్రాన్, ఎస్ఆర్ ప్రభు తదితరులు ట్వీట్ చేశారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ట్విట్టర్ ద్వారా వివేక్ మృతికి సంతాపం తెలియజేశారు. కె బాలచందర్ దర్శకత్వం వహించిన ‘మనదిల్ ఉరుది వేండం’ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన వివేక్… ఆ తరువాత దాదాపుగా 300లకు పైగా చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించారు వివేక్.