NTV Telugu Site icon

Rajnikanth : వేట్టయాన్ ట్విట్టర్ రివ్యూ.. సరే సరే లే ఎన్నెన్నో అనుకుంటాం..

Vettyan Review

Vettyan Review

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న చిత్రం వేట్టయాన్. జై భీమ్ వంటి సినిమాను తెరకెక్కించిన టీజే జ్ఞానవేల్ వేట్టయాన్ కు దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 10న( గురువారం ) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  పాన్ ఇండియా భాషలలో తెరకెక్కిన  ఈ సినిమాను భారీ బడ్జెట్ చిత్రాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమా నిర్మించింది. ఇటీవల విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలు పెంచింది.నేడు తెల్లవారు జామున ఉదయం 4: 00 గంటల స్పెషల్ ప్రీమియర్స్ తో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రన్ని వీక్షించిన కొందరు నెటిజన్స్ సోషల్  మీడియాలో తమ అభిప్రాయాన్ని వెల్లడిచారు. మరి వేట్టయాన్ పైనెటిజన్స్ రివ్యూ ఎలా ఉందొ చదివేద్దాం పదండి.

వెట్టయన్ మొదటి భాగం ఇటీవలి కాలంలో వచ్చిన బెస్ట్  స్క్రిప్ట్‌లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. దర్శకుడు టీజే జ్ఞానవేల్ సామాజిక  మెసేజ్ తో కూడిన ఆలోచింపజేసే సందేశంతో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ,కథాంశాన్ని రూపొందించారు. రేసీ స్క్రీన్‌ప్లే మరియు దర్శకత్వం మిమ్మల్ని స్క్రీన్‌కి కట్టిపడేస్తుంది. రజనీ, అమితాబ్, ఫహద్ సింప్లీ సూపర్బ్. కానీ కామెడీ కోరుకుంటే మాత్రం మిమ్మల్ని కాస్త నిరుత్సహ పరుస్తుంది. ఫస్ట్ హాఫ్ ను అద్భుతంగా తెరెకెక్కించిన జ్ఞానవేల్ సెకండ్ హాఫ్ కాస్త తడబడ్డాడు. సెకండ్ హాఫ్ ను కొద్దిగా ఫాస్ట్ గా నడిపి ఉంతే బాగుండేది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. అనిరుధ్ తన BGM తో సినిమాకు మరింత హైప్ తెచ్చాడు. అలాగే అనిరుధ్ ఓ షాట్ లో తళుక్కున మెరిశాడు. మొత్తానికి  వేట్టయాన్ మొదటి భాగం దీపావళి, సెకండ్ హాఫ్ కార్తీక దీపం లా ఉందని తెలుస్తుంది.

Show comments