75 ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు లైన్ లో పెడుతున్నాడు అంటే అది సూపర్‌స్టార్ రజినీకాంత్‌కు మాత్రమే సాధ్యం. ప్రస్తుతం ‘కూలీ’ సినిమా కంప్లీట్ చేసిన తలైవా.. ‘జైలర్ 2’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. వయసు మీద పడిన కూడా తన స్టైల్, మేనరిజంలో ఊపు మాత్రం తగ్గడం లేదు. సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తులో నిలుస్తున్నాడు. ఈ క్రమంలోనే రజినీకాంత్ రెమ్యునరేషన్ మరోసారి హాట్‌టాపిక్‌గా మారింది. ‘కూలీ’ సినిమా కోసం ఏకంగా రూ.260 కోట్ల నుంచి రూ.280 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేశంలో మరే హీరో కూడా ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకున్నది లేదు. అలాంటి రజినీకాంత్ ఓ సందర్భంలో హీరోయిన్ల కంటే తక్కువ రెమ్యునరేషన్ తీసుకునేవారంట.
Also Read : Naveen Chandra : సినిమా నచ్చకుంటే..మీ డబ్బు వెనక్కి ఇచ్చేస్తాం
ఇప్పుడంటే పారితోషికం రూ.కోట్లల్లో ఉన్నాయి గాని 1970ల్లో వేలల్లో, మరికొంత మందైతే నెలవారీ జీతాల కింద తీసుకునేవారు. అయితే రజినీకాంత్, కమల్ హాసన్, శ్రీదేవి ప్రధాన పాత్రలుగా 1976లో వచ్చిన ‘మూండ్రు ముడిచ్చు’ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి కె. బాలచందర్ దర్శకత్వం వహించారు. అప్పటికే స్టార్ హోదాలో ఉన్న కమల్ హాసన్ రూ.30,000 , స్టార్ హీరోయిన్ శ్రీదేవి రూ.5,000 రెమ్యునరేషన్ ఇవ్వగా.. రజినీకాంత్‌కి కేవలం రూ.2వేలు మాత్రమే ఇచ్చారట. కానీ రోజులు ఎప్పుడు ఒకేలా ఉండవు కదా. ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న హీరోగా రజినీకాంత్ ఎదిగారు.
