NTV Telugu Site icon

Rajinikanth : హాస్పిటల్ లో రజినీ.. తదుపరి సినిమాల పరిస్థితి ఏంటి..?

Untitled Design

Untitled Design

సూపర్ స్టార్ రజనీకాంత్ అనారోగ్య కారణాలతో చెన్నై అపోలో హాస్పిటల్ లో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. నేడో,రేపో ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. కొన్ని రోజులు ఎటువంటి షూటింగ్స్ వంటివి చేయకుండా పూర్తి విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. మరో వైపు రజనీనటిసున్న సినిమాల పరిస్థితి ఏంటన్న డైలమా నెలకొంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం రజనీ సినిమాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలుస్తోంది. టీజీ జ్ఞానవేల్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్న చిత్రం వెట్టయాన్ ది హంటర్ అక్టోబరు 10న రిలీజ్ కురెడీ గా ఉంది.

Also Read : Karthi : కే. విశ్వనాథ్, బాలచందర్, కమల్ హాసన్, దాసరి నారాయణరావుకి థాంక్స్ చెప్పాలి

ఈ సినిమాకు సంబంధించి మొత్తం వర్క్ ను సూపర్ స్టార్ కంప్లిట్ చేసాడు. ఇక రజనీ నటిస్తున్న మరొక చిత్రం కూలీ. సన్ పిచ్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమాను బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడులోకేష్ కానగరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఇటీవల ఈ చిత్ర లాంగ్ షెడ్యూల్ వైజాగ్ లో స్టార్ట్ చేసారు. కాగా కూలీ విశాఖపట్నం షూటింగ్ ఈ వారంతో ముగియనుంది, రజనీ, నాగార్జున కాంబోలో సీన్స్ కంప్లిట్ చేసారని సమాచారం. కూలీ తదుపరి షెడ్యూల్ ను అక్టోబర్ 17న చెన్నైలో స్టార్ట్ చేయనుంది టీమ్. అప్పటికి రజనీ పూర్తిగా కోలుకొని ఈ షెడ్యుల్ లో రజనీ పాల్గొంటారని యూనిట్ టాక్. ఈ చిత్రంలో పాన్ ఇండియన్ నటీనటులు యాక్ట్ చేయనున్నారు. వారి కాంబినేషన్ లో వచ్చే రజనీ సీన్స్ ను చివరలో షూట్ చేసి రజనీ లేని సీన్స్ ను ఈ లోగా ఫినిష్ చేయనున్నాడు దర్శకుడు లోకేష్.

Show comments