సూపర్‌స్టార్ రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ సినిమా ‘కూలీ’, ఆగస్టు 14న పాన్ ఇండియా లెవల్లో విడుదలకు సిద్ధమవుతోంది. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రంలో.. నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ వంటి స్టార్‌లు భాగం అయ్యారు. దాదాపుగా 370 కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ఓ గెస్ట్ రోల్‌లో మెరవనున్నారు. పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేస్తుండగా, అనిరుధ్ మ్యూజిక్ డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
Also Read : Bhagyashree : దీపికా, మృణాల్, రష్మిక, జాన్వీ తో పాటు భాగ్యశ్రీ..?
అయితే రీసెంట్ గా చెన్నైలో జరిగిన ఆడియో లాంచ్‌లో రజనీకాంత్ చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.. ‘సత్యరాజ్‌గారితో నాకు విబెదాలున్నా, ఆయన నిజాయితీగా మాట్లాడగల గొప్ప వ్యక్తి. అలాంటి వాళ్లను మనం నమ్మాలి. కానీ ప్రతి విషయం మనసులో పెట్టుకునే వాళ్లను మాత్రం నమ్మకూడదు’ అని తలైవా స్పష్టం చేశారు. ఈ విషయం పై తలైవా ఇలా స్పందించడం అందరిని షాక్ కి గురి చేసింది. అలాగే.. ప్రమోషన్స్‌లో భాగంగా లోకేష్ కనగరాజ్ గురించి చెబుతూ.. ‘లోకేష్ కథ చెప్పిన మొదటి రోజు నుంచే నాకు ఈ సినిమా స్పెషల్ అనిపించింది’ అని అన్నారు. కింగ్ నాగ్ గురించి మాట్లాడుతూ.. ‘ఇక ఈ వయసులోనూ ఆయన ఎంతో యంగ్‌గా కనిపిస్తున్నారు. నా జుట్టంతా ఊడిపోయింది. మీ ఫిట్‌నెస్ రహస్యం ఏమిటంటే, వ్యాయామమే అంటారు. ఈ సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించారు’ అని ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, “ఎంత డబ్బు, పేరు వచ్చినా ఇంట్లో మనశ్శాంతి, బయట గౌరవం లేకపోతే జీవితం లాభం లేదు” అంటూ హృదయాన్ని తాకే మాటలు చెప్పారు. దీంతో ‘కూలీ’ చిత్రంపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండగా, ఈ ఎమోషనల్ కామెంట్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
