Dharman: ‘ధర్మన్’లో లేడీ సూపర్‌స్టార్ ఎంట్రీ.. నాలుగోసారి క్రేజీ కాంబో రిపీట్!

Dharman Movie

Dharman Movie

Dharman: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ సీక్వెల్ ‘జైలర్ 2’ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దుమ్మురేపుతోంది. ఈ సక్సెస్ జోష్‌లోనే రజనీకాంత్ తన తర్వాతి ప్రాజెక్ట్‌ను శరవేగంగా పట్టాలెక్కించారు. యువ దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాలిడ్ యాక్షన్ చిత్రం ‘ధర్మన్’. భారీ అంచనాల నడుమ ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నుంచి మూవీ టీమ్ ఇచ్చిన ఒక అప్‌డేట్ కోలీవుడ్‌తో పాటు సౌత్ సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ సినిమాలో లేడీ సూపర్‌స్టార్ నయనతార కీలక పాత్రలో నటిస్తున్నట్లు మేకర్స్ ఒక టీజ్ ద్వారా అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. దీంతో రజనీకాంత్, నయనతార కాంబో మరోసారి వెండితెరపై సందడి చేయబోతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘చంద్రముఖి’, ‘శివాజీ’, ‘దర్బార్’ చిత్రాలు ఎంతటి ఘన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ‘ధర్మన్’తో ఈ సూపర్ హిట్ జోడీ నాలుగోసారి స్క్రీన్ షేర్ చేసుకోనుంది. ఈ సినిమాలో నయన్ రోల్ ఎలా ఉండబోతోంది? ఆమె ఎంట్రీ వెనుక కథేంటి? అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను లోకనాయకుడు కమల్ హాసన్ స్వయంగా నిర్మిస్తుండటం సినిమాపై ఉన్న క్రేజ్‌ను రెట్టింపు చేసింది. అంతేకాకుండా రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అరుణ్ మాతేశ్వరన్ రా అండ్ రస్టిక్ యాక్షన్ మేకింగ్, రజినీ స్టైల్, నయనతార స్క్రీన్ ప్రెజెన్స్, అనిరుధ్ అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.. వీటన్నింటి కలయికతో ‘ధర్మన్’ బాక్సాఫీస్ వద్ద మరో సంచలనానికి తెరతీయడం ఖాయంగా కనిపిస్తోంది.