Site icon NTV Telugu

అన్నాత్తే : హైదరాబాద్ లో షూటింగ్ పూర్తి చేసిన రజినీకాంత్

Rajinikanth has wrapped up the shoot of Annaatthe at Hyderabad

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. అయితే తాజాగా హైదరాబాద్ లో ‘అన్నాత్తే’ షూటింగ్ పూర్తి చేశారు రజినీ. ఈరోజు ‘అన్నాత్తే’ హైదరాబాద్ షెడ్యూల్ ను పూర్తి చేసిన రజినీకాంత్ చెన్నైకు బయల్దేరారు. రజినీ ప్రైవేట్ జెట్ లో చెన్నైకు బయల్దేరిన పిక్స్, వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ లో జరిగిన 35 రోజుల నాన్ స్టాప్ షెడ్యూల్ ను అన్ని కోవిడ్-19 జాగ్రత్తలు తీసుకుంటూ విజయవంతంగా పూర్తి చేశారు ‘అన్నాత్తే’ టీం. దీపావళి కానుకగా ‘అన్నాత్తే’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Exit mobile version