Dharman: సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న సూపర్ స్టార్.. ‘ధర్మన్’ రిలీజ్ ఎప్పుడంటే?

Rajinikanth Dharman

Rajinikanth Dharman

Dharman: సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా వస్తుందంటే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. అలాంటిది ఏకంగా సంక్రాంతి బరిలోనే తలైవర్ దిగుతున్నారంటే ఆ సందడే వేరు. సూపర్ స్టార్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ధర్మన్’ను పొంగల్ 2027 బరిలో దించుతున్నారంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట తెగ ప్రచారం సాగింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. సంక్రాంతి రేసులో ‘ధర్మన్’ లేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా 40 శాతం వరకు బ్యాలెన్స్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. ఈ సినిమా షూటింగ్ నవంబర్ నెలాఖరు వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోందని చిత్ర బృందం సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

దీనికితోడు భారీ స్థాయిలో సాగాల్సిన పోస్ట్ ప్రొడక్షన్, సిజిఐ పనులు కూడా ఇంకా పూర్తి కాలేదట. వర్క్ ఏమాత్రం లేట్ కాకుండా ఉండేందుకు ప్రతి షెడ్యూల్ ముగియగానే సీజీ వర్క్ కోసం ఫుటేజ్‌ను పంపుతూ పనులను వేగవంతం చేస్తున్నారని టాక్. ఎలాంటి హడావుడి లేకుండా అవుట్‌పుట్ పక్కాగా తీసుకురావాలనే ఉద్దేశంతో సంక్రాంతి రేసు నుంచి సినిమాను తప్పించినట్లు సమాచారం. అయితే వేసవి కానుకగా ఏప్రిల్ మధ్యలో లేదా తమిళ నూతన సంవత్సరం సమయంలో సినిమాను తీసుకొచ్చే ఆలోచనలో మేకర్స్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నారంటూ వచ్చిన వార్తల్లోనూ ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. నెల్సన్ డైరెక్షన్‌లో రానున్న స్పెషల్ ప్రాజెక్ట్ (KHxRK) కోసం మాత్రమే రజినీ – కమల్ కాంబో క్రేజ్‌ను వాడాలని భావిస్తున్నారట. సంక్రాంతికి మిస్సయినా.. కొత్త రిలీజ్ డేట్‌తో తలైవర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తారో చూడాలి.