Site icon NTV Telugu

Rajanikanth : తెరపైకి రజనీకాంత్ బయోపిక్..తలైవా పాత్రలో కనిపించేది ఎవరంటే..?

Whatsapp Image 2024 05 01 At 6.58.24 Pm

Whatsapp Image 2024 05 01 At 6.58.24 Pm

సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓ మాములు బస్సు కండక్టర్ గా వున్న రజనీకాంత్ ఎటువంటి సినీ బాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చి తన స్టైల్ తో తన నటనతో ప్రేక్షకులు ఎంతగానో మెప్పించిన ఆయన అనతి కాలంలోనే ‘సూపర్ స్టార్ ‘గా ఎదిగారు.అలాంటి లెజెండరీ యాక్టర్ బయోపిక్ కి ప్రస్తుతం రంగం సిద్ధమయినట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాడ్ వాలా తలైవా రజనీకాంత్ బయోపిక్ ను భారీ స్థాయిలో రూపొందించేందుకు సిద్ధం అయినట్లు సమాచారం. తాజాగా ఆయన తలైవాను కలవడంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది.తలైవాను కలిసిన సాజిద్ నడియాడ్ వాలా తన బయోపిక్ కోసం అగ్రిమెంట్ చేసుకునేందుకు వచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.తలైవా రజనీకాంత్ బిగ్ ఫ్యాన్ అయిన సాజిద్ తన అభిమాన నటుడి జీవితం వెండితెరపై ఆవిష్కరించేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

రజనీ జీవితం ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తుంది .అందుకే ఈ బయోపిక్ కోసం సాజిద్ భారీగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ మూవీలో రజనీ పాత్రను ఎవరు పోషిస్తారనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది.తలైవా స్టైల్ ను,మ్యానరిజంను మ్యాచ్ చేసే నటుడు కోసం వెతుకుతున్నట్లు సమాచారం.అయితే రజనీ పాత్రలో స్టార్ హీరో ధనుష్ నటించే అవకాశం ఉందని ఓ వార్త వైరల్ అవుతుంది. ప్రస్తుతం ధనుష్ ఇళయరాజా బయోపిక్ లో నటిస్తున్నారు..అయితే రజనీ పాత్రలో ధనుష్ నటించే విషయంపై క్లారిటీ రావాల్సి వుంది .

Exit mobile version