రజనీకాంత్ హీరోగా ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ, టాప్ లీగ్‌లో కొనసాగుతున్నారు. అయితే ఆయన కెరీర్ ప్రారంభంలో శ్రీదేవిని ప్రేమించారట. ఈ విషయాన్ని ఆమెకు చెప్పేలోపే, చెప్పకుండా ఆగిపోయారు. ఒకరకంగా వీరి ప్రేమకు అడ్డుపడింది ఎవరో తెలుసా? తెలుసుకుంటే మీరు షాక్ అవ్వక తప్పదు. ఎందుకంటే వీరి ప్రేమకు అడ్డుపడింది ఎవరో కాదు — కరెంట్, ఎలక్ట్రిసిటీ అండి! మన భాషలో “కరెంటు” అని పిలుస్తూ ఉంటాం కదా? అదే అసలు విషయం.
Also Read:Nimisha Priya: నిమిష ప్రియను వీలైనంత త్వరగా ఉరితీయండి…
రజనీకాంత్, శ్రీదేవి కలిసి దాదాపు 18 సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య చాలా మంచి బాండింగ్ ఉండేది. ఒకానొక సమయంలో, రజనీకాంత్ అనారోగ్యానికి గురయ్యారు. అప్పుడయితే, శ్రీదేవి ఏడు రోజులు పాటు ఉపవాసం ఉండి, ఆయన ఆరోగ్యం మళ్లీ మునుపటిలా కావాలని మొక్కుకుందట. అంతలా వారి మధ్య బలమైన బంధం ఉండేది. కాబట్టే ఒక సందర్భంలో, రజనీకాంత్ ఆమెకు తన ప్రేమను వ్యక్తం చేసి, పెళ్లి వరకు తీసుకెళ్లాలని అనుకున్నారట. ఒక రోజు, శ్రీదేవి కొత్త నివాసంలోకి వెళ్లేందుకు గృహప్రవేశం పెట్టుకుంది.
Also Read:Coolie : నాగార్జునపై రజినీకాంత్ జోకులు..
ఆ ఫంక్షన్ రోజే, రజనీకాంత్ ఆమెకు తన ఆలోచన వ్యక్తపరచేందుకు వెళ్లారు. సరిగ్గా వ్యక్తపరచే సమయానికి కరెంటు పోవడంతో, దాన్ని అపశకునంగా భావించి, శ్రీదేవికి రజనీకాంత్ ప్రపోజ్ చేయలేదట. ఈ విషయాన్ని, అటు శ్రీదేవికి ఇటు రజనీకాంత్‌కి గురువు లాంటి దర్శకుడు కె. బాలచందర్ ఒకానొక సందర్భంలో వెల్లడించారు.
