సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్రలో అశ్విత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ధర్మన్’. లోకనాయకుడు కమల్ హాసన్‌కు చెందిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రజనీకాంత్‌కు ధీటైన అల్లుడి పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ రోల్‌లో రామ్ కనిపించనున్నట్లు సమాచారం.
ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సొషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ స్టార్ డాక్టర్ గా కనిపించబోతున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను రాబోయే సంక్రాంతి కానుకగా థియేటర్లలోకి తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. అందుకు తగ్గట్టే షూటింగ్ ను జెట్ స్పీడ్ లో ఫినిష చేసేలా షెడ్యూల్ ప్లాన్ చేశారట మేకర్స్. ఒకవేళ సంక్రాంతికి వస్తే ఈసారి పోటీ రసవత్తరంగా ఉంటుంది. ఇప్పటికే జనవరి 12న విడుదల, చిరు – బాబీ సినిమా, జార్జిక్రిష్ సినిమాలు రేస్ లో ఉన్నాయి. ఇప్పడు రజనీ సినిమా వస్తే పొంగల్ పోరు జోరుగా ఉంటుంది. కోలీవుడ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి సిమ్రాన్, రాశీ ఖన్నా కీలక పాత్రలు పోషిస్తున్నారు. రజనీకాంత్ మాస్ స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ ఎనర్జీ కలగలిసి రానున్న ఈ మామా-అల్లుళ్ల ఈగో వార్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

