Site icon NTV Telugu

KH x RK Reunion: ఇంతకీ ఎవరు హీరో?.. రజనీ-కమల్ స్పెషల్‌ వీడియో అదిరిందిగా!

Kh X Rk Reunion

Kh X Rk Reunion

Rajinikanth and Kamal Haasan Reunion Movie: యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చేసింది. సుమారు నాలుగు దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. తమిళ చిత్ర పరిశ్రమలోని ఇద్దరు దిగ్గజాలు ‘సూపర్ స్టార్’ రజనీకాంత్, ‘ఉలగనాయగన్’ కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 1979లో విడుదలైన ‘అల్లావుద్దీనుమ్‌ అద్భుత విళక్కుమ్‌’ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో పాన్ ఇండియా లెవల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేస్తు.. అనౌన్స్మెంట్ ఇచ్చారు. ‘జైలర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ నెల్సన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. ఇక ఈ వీడియో మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. వింటేజ్ టచ్ ఇస్తు.. రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌లు పోటాపోటీగా స్టైలిష్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ‘ఇందులో ఎవరు హీరో?’ అని వీరిద్దరూ అడగడం చాలా ఫన్నీగా అనిపిస్తోంది.

ఇక ఈ చిత్రానికి అనిరుధ్‌ రవిచంద్రన్ మ్యూజిక్ హైలెట్‌గా నిలవబోతోంది. స్పెషల్ వీడియోకి అనిరుధ్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత బ్యానర్ అయిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అండ్ రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Exit mobile version