Site icon NTV Telugu

యూఎస్ లో రజినీకాంత్… లేటెస్ట్ పిక్ వైరల్

Rajinikanth and Asishwarya's Latest Pic from the US

సూపర్ స్టార్ రజినీకాంత్ తాజాగా యూఎస్ లో కన్పించగా క్లిక్ మని అనిపించిన పిక్ ఒకటి వైరల్ గా మారింది. ఈ పిక్ లో ఆయనతో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్య ధనుష్ కూడా ఉన్నారు. ప్రస్తుతం రజనీకాంత్ యూఎస్ లోని మాయో క్లినిక్‌లో సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. జూన్ 19న రజినీ తన భార్య లతతో కలిసి రొటీన్ హెల్త్ చెకప్ కోసం అమెరికా వెళ్లిన విషయం విదితమే. ఆయన 2016లో అక్కడే కిడ్నీ మార్పిడి చేయించుకున్నాడు. నెట్‌ఫ్లిక్స్ “ది గ్రే మ్యాన్” చిత్రీకరణ కోసం ధనుష్, అతని భార్య ఐశ్వర్య, వారి పిల్లలు యూఎస్‌లోనే ఉన్నారు. ఇక ఇప్పుడు ఓ అభిమాని ద్వారా ఈ పిక్ బయటకు రావడంతో ఆయన ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుకుంటూ సూపర్ స్టార్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ పిక్ ను భారీ సంఖ్యలో షేర్ చేస్తున్నారు. రజనీకాంత్, ఆయన భార్య లత, ధనుష్, ఐశ్వర్య, వారి పిల్లలు కొద్ది రోజుల్లో తిరిగి ఇండియాకు వస్తారు. ఆ తరువాత రజనీకాంత్, ధనుష్ తమ తమ చిత్రాల షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తారు.

Read Also : వంటకం మొదలెట్టిన మిల్కీబ్యూటీ!

ఇప్పటికే రజినీకాంత్ హీరోగా నటిస్తున్న “అన్నాత్తే” మూవీలో ప్రధాన భాగాన్ని పూర్తి చేశారు. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ను త్వరలోనే తిరిగి ప్రారంభించనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మించిన “అన్నాత్తే” దీపావళి సందర్భంగా నవంబర్ 4 న థియేటర్లలో విడుదల కానుంది. మరోవైపు కార్తీక్ నరేన్‌తో ధనుష్ తన నెక్స్ట్ మూవీ షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రాన్ని “డి43” అనే వర్కింగ్ టైటిల్ తో పిలుస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Exit mobile version