Rajendra Prasad: MGRపై అనుచిత వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా నటుడు రాజేంద్ర ప్రసాద్ మరోసారి నోరు జారిన సంగతి అందరికీ తెలిసిందే. ఆయనకు కొద్దిరోజుల క్రితం కాంతారావు అవార్డు ప్రకటించారు. ఆ అవార్డు అందుకుంటున్న సమయంలో కాంతారావును పొగుడుతూ, తమిళనాడు మాజీ సీఎం, అక్కడ అత్యంత జనాదరణ కలిగిన నటుడు ఎం.జి.ఆర్. ను ఆయన విమర్శించారు. కాంతారావును చూసి ఆయన భయపడిపోయేవారు అని అర్థం వచ్చేలా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయం మీద అక్కడి నటీనటులు సీరియస్ అవుతున్నారు. తాజాగా విషయాలు ఒకటి చేయగా నాజర్ ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలోనే తమిళంలో క్షమాపణలు చెబుతూ రాజేంద్ర ప్రసాద్ ఒక వీడియో రిలీజ్ చేశారు.
Also Read:Allu Ayaan: సినిమా వేషాలు వేస్తానని ఇంట్లో వేషాలు వేస్తున్న అల్లు అయాన్
Also Read
- Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
- Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
- KTR: ‘‘చావు నోట్లో తల పెట్టయినా.. మీకు గుర్తింపు తెస్తా’’.. ‘ది ప్యారడైజ్’ సినిమాపై కేటీఆర్ సంచలన రివ్యూ
- Nani: "ఒక్కసారి ఆయన ఓన్ చేసుకుంటే.. ఆ ప్రేమని తట్టుకోలేం": మోహన్ బాబుపై నాని ఎమోషనల్ కామెంట్స్!
“అందరికీ నమస్కారం, నేను తెలుగు నటుడు రాజేంద్ర ప్రసాద్‌ని. నాకు రెండు రోజులకు ముందు ఈ ఊర్లో ఒక ఫంక్షన్ చేశారు. అక్కడ మహానటుడు కాంతారావు అవార్డు మాకు అందించారు. ఆ ఫంక్షన్ లో నేను మాట్లాడే సమయంలో సరదాగా మాట్లాడుతూ, తమిళ సినిమాకు దేవుడు లాంటి ఎం.జి.ఆర్. గురించి సరదాగా ఒక తప్పు మాట మాట్లాడాను. ఆయన గురించి ఎవరైనా అలా మాట్లాడతారా? మాకు కూడా ఆయన అంటే ఎనలేని గౌరవం. పొరపాటున ఆ మాట వచ్చిందే కానీ, ఆయన్ని అగౌరవపరచాలనే ఉద్దేశం నాకు లేదు. నేను మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో చదువుకుంటున్నప్పుడు ఆయనే సీఎం. ఆయన మాటల నుంచి కూడా నేను ఇన్స్పైర్ అయ్యాను. ఆయన గురించి నేను పొరపాటున అలా మాట్లాడాను. అలా మాట్లాడినందుకు ఎవరైనా ఫీలయ్యి ఉంటే నన్ను క్షమించండి. ఇకమీదట ఎప్పుడూ నేను అలా మాట్లాడను అని మాటిస్తున్నాను. ఈ విషయంలో నన్ను క్షమించండి”
అని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Shah Rukh Khan : షారూఖ్ కోసం వెయిట్ చేస్తోన్న సీక్వెల్స్.. డాన్3లో రిటర్న్ కాబోతున్నాడని టాక్
-
IND vs WI 1st ODI: నేడు భారత్, వెస్టిండీస్ మొదటి వన్డే.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, పిచ్ డీటెయిల్స్ ఇవే!
-
BYD Seal U PHEV SUV: భారత్‌లోకి BYD తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ SUV.. 26.6 kWh బ్యాటరీ, 1,000KM కు పైగా రేంజ్
-
Hyderabad: “కల్తీ ఫుడ్, కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు”.. హైదరాబాద్‌లోని ఈ 11 ప్రముఖ రెస్టారెంట్ల లైసెన్సులు రద్దు
-
Siva Karthikeyan : స్టార్ హీరోలు వదిలేసిన కథలతో శివకార్తీకేయన్ ప్రయోగాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?