పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాజాసాబ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధ్వర్యంలో భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో ప్రభాస్‌కు జోడీగా మూడు కథానాయికలు కనిపించనున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్. ఇక రీసెంట్‌గా విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదలైన ఈ టీజర్‌లోని హాస్యభరిత డైలాగులు, ప్రభాస్ కొత్త అవతారం, విజువల్ ఎఫెక్ట్స్ సినీ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రభాస్ చెప్పిన ‘బండి కొంచెం మెల్లగా’, ‘అసలే మన లైఫ్ అంతంతమాత్రం’ వంటి డైలాగులు యువతలో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.
అయితే తాజాగా ఈ ముగ్గురిలో ఒకరు, సినిమా నుంచి ఓ మాసివ్ అప్‌డేట్ లీక్ చేశారు. తనే మాళవిక మోహనన్ ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో అభిమానులతో జరిగిన లైవ్ చాట్‌లో.. తమన్ సంగీతంలో ఒక క్రేజీ మాస్ సాంగ్ ప్రభాస్‌తో చేయడం జరిగిందని చెప్పింది. ఈ లీక్ విని అభిమానులు ఖుషీగా ఫీలవుతున్నారు. ప్రభాస్ మాస్ స్టైల్‌లో డాన్స్ చేస్తే ఎలా ఉంటుందా అని వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు ఇది పండుగే. మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ బీట్స్‌తో మాస్ సాంగ్ అంటే థియేటర్‌లో స్పీకర్స్ బద్దలవడం కాయం.
