Site icon NTV Telugu

The RajaSaab : బాబోయ్.. భారీ ధర పలుకుతున్న రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్

The Rajasaab

The Rajasaab

ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాజాసాబ్. కల్కి తర్వాత ప్రభాస్ చేస్తున్న మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఇది. మారుతీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఫైట్స్, కామెడీ, డ్యాన్స్‌తో పాటు ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు డార్లింగ్. పైగా ఫస్ట్ హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ ఓల్డ్ లుక్‌లో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. వింటేజ్ ప్రభాస్ కామెడీ టైమింగ్ తో  నవ్వులు పూయించాడు .

ఇదిలా ఉండగా ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత భారీ బడ్జెట్ పై నిర్మిస్తోంది. అయితే రిలీజ్ కు ముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాజాసాబ్ భారీ రిటర్న్స్ రాబట్టనున్నాడు. అందిన సమాచారం మేరకు రాజాసాబ్ నాన్ థియేట్రికల్ రైట్స్ రూ. 180 నుండి 210 కోట్ల మేరకు రావచ్చట. హిందీ కాకుండానే ఈ ఫిగర్ ఉండొచ్చు అని సమాచారం. ఇక థియేట్రీకల్ రైట్స్ ను చెప్పక్కర్లేదు. నైజాం వంటి ఏరియాలు వంద కోట్ల మేర పలికే అవకాశం ఉంది. నార్త్ రైట్స్ కూడా భారీగా ఉండబోతున్నాయి. ఈ సినిమాకు ఈ స్థాయిలో డిమాండ్ ఉందంటే రెండు మాట లేకుండా డార్లింగ్ కారణమనే చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. ప్రభాస్ పై సాంగ్స్ షూట్ చేస్తున్నారు. యంగ్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఈ ఏడాది డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో దిగుతోంది.

Exit mobile version