రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ది రాజా సాబ్’. హార్రర్, కామెడీ, రొమాంటిక్ కథాంశంతో రానున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ పై విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన రాజాసాబ్ ఫస్ట్ గ్లిమ్స్ కు భారీ స్పందన వచ్చింది.
Also Read : War2 : నిరాశపరుస్తున్న ఓవర్సీస్ వార్ 2 బుకింగ్స్ .. కారణాలు ఇవే
కాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్దీ రోజులగా రోజుకొక డేట్ ఫినిపిస్తోంది. గత కొద్దీ రోజులుగా అయితే రాజాసాబ్ సంక్రాంతికి వస్తుందని వార్తలు హల్ చల్ చేసాయి. ఈ వార్తలన్నిటికి నిర్మాత విశ్వప్రసాద్ ఒక్కమాటతో ఫుల్ స్టాప్ పెట్టేసారు. తాజాగా విస్వప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ’ రాజాసాబ్ అక్టోబర్ నాటికి రెడీ అవుతుంది. తెలుగు బయ్యర్స్ జనవరి 9రిలీజ్ చేయమని, హిందీ బయ్యర్స్ డిసెంబరు 5 రిలీజ్ చేయమని అడుగుతున్నారు. అటు ఫ్యాన్స్ కూడా సంక్రాతికి కావాలని అడుగుతున్నారు. ప్రస్తుతానికి అయితే మేము కూడా డిసెంబర్ 5 లేదా 6న విడుదల చేయాలనీ ఆలోచనలో ఉన్నాం. టాకీ పార్ట్ పూర్తి చేసాం, సాంగ్స్ షూట్ పెండింగ్ ఉంది. రెమైనింగ్ మొత్తం ఫినిష్ చేసాం. VFX విషయంలో కూడా ఎక్కడ కంప్రమైజ్ కాకుండా చేస్తున్నాం’ అని అన్నారు. అయితే వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పటికే చాలా సినిమాలు కర్చీఫ్ వేసుకుని ఉన్నాయి. ఒకవేళ రాజాసాబ్ సంక్రాంతికి వస్తే ఇతర సినిమాలు పోస్ట్ పోన్ చేసుకోక తప్పదు.
