రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం.ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో అనేక సార్లు జక్కన్న ప్రకటించాడు. అయితే ఏ ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటినుండో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే ఇద్దరు హీరోలు ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూలలో తెలిపాడు. మహాభారతంలో కీలకమైన శ్రీ కృష్ణడు పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను అనుకున్నట్టు తెలిపాడు జక్కన్న. ఎన్టీఆర్ ను శ్రీ కృష్ణుడిగా చూపించాలని తన కోరిక అని కూడా తెలిపాడు.
ఇక మరొక ముఖ్యమైన పాత్ర అయిన కర్ణుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ ను చూపిస్తానని చెప్పాడు రాజమౌళి. ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని అప్పట్లో అన్నారు. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మహాభారతం సిరీస్ లోకి వచ్చి చేరాడు నేచురల్ స్టార్ నాని. ఈ యంగ్ హీరో నటించిన లేటెస్ట్ సినిమా హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గత ఆదివారం హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మహాభారతంలో నానిని తీసుకుంటానని తెలిపాడు. మరి నానిని ఏ రోల్ లో చూపిస్తాడో జక్కన్న. దీంతో ఇప్పటికి మహాభారతంలో ముగ్గురు హీరోలు లాక్ చేసాడు జక్కన్న. అయితే ఇప్పుడు అందరికి ఒకటే డౌట్ అసలు ఈ సిరీస్ ను రాజమౌళి ఎప్పుడు తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయాలంటే ఇంకో మూడేళ్లు పడుతుంది. ఏదేమైనా రాజమౌళి మహాభారతం సిరీస్ తెరకెక్కించే సూచనలు ఇప్పట్లో కనబడేలా లేవు.
