Site icon NTV Telugu

Rajasab : రెమ్యునరేషన్ తగ్గించిన ప్రభాస్..!

Prabas Rajasab

Prabas Rajasab

మారుతి దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాజాసాబ్’. హారర్ కామెడీ డ్రామా గా వస్తున్న ఈ సినిమాలో డార్లింగ్ జోడిగా మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. కొన్ని రోజులుగా ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది. అలాగే ఈనెల 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడిస్తూ ప్రభాస్ కు సంబంధించి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రభాస్ నుంచి మొదటిసారిగా హారర్ నేపథ్యం వస్తున్న మూవీ కావడంతో అందరి దృష్టి ఈ చిత్రంపైనే ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్‌కు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Also Read : NTR : ఎన్టీఆర్ – నీల్ మూవీలో కేతిక శర్మ ?

ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పై టి.జి.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమా కోసం ప్రభాస్ తన రెగ్యులర్ రెమ్యునరేషన్ రూ.150 కోట్లు కాకుండా రూ.100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట. ఈ సినిమా కోసం ఆయన రూ.50 కోట్లు తగ్గించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి కారణం కూడా ఉందని తెలుస్తోంది. ఎందుకంటే గతంలో ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రంతో ఈ నిర్మాత చాలా నష్టం చవిచూశారు. అందుకే, ఇప్పుడు ఆయన కోసం ప్రభాస్ తన రెమ్యునరేషన్ తగ్గించినట్లు తెలుస్తోంది.

Exit mobile version