NTV Telugu Site icon

సాంగ్ : “రాజ రాజ చోర” నుంచి చోరుడు వచ్చేశాడు !

Raja Raju Vacche Lyrical Video Song from Raja Raja Chora Movie

యంగ్ హీరో శ్రీవిష్ణు హీరోగా నటిస్తున్న విభిన్న కథా చిత్రం “రాజ రాజ చోర‌”. పోస్టర్లతోనే ఆసక్తిని పెంచేసిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్, సున‌య‌న హీరోయిన్లుగా నటిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ ప‌తాకంపై టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న‌ ఈ చిత్రానికి హ‌సిత్ గోలి ద‌ర్శ‌కుడు. దీనికి వివేక్ కూచిభొట్ల స‌హ నిర్మాత కాగా, కీర్తి చౌద‌రి క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తనికెళ్ళ భరణి, రవిబాబు,కాదంబరి కిరణ్, శ్రీకాంత్ అయ్యంగార్, అజయ్ ఘోష్,వాసు ఇంటూరి ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్న ఈ సినిమాకు సంగీతం వివేక్ సాగ‌ర్ స‌మ‌కూర్చారు. తాజాగా ఈ చిత్రం నుంచి “రాజ రాజు వచ్చే” అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

Read Also : ఆగస్ట్ 2 నుంచి అమెజాన్ లో స్పై థ్రిల్లర్ ‘ద కొరియర్’!

“ది చోర సాంగ్” అంటూ విడుదల చేసిన ఈ సాంగ్ ను మోహన భోగరాజు ఆలపించారు. హసిత్ గోలి లిరిక్స్ అందించారు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు రీఓపెన్ అవుతుండడంతో సినిమాలన్నీ ఒక్కొక్కటిగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ చోరుడు కూడా త్వరలోనే థియేటర్లలో ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఇక తాజాగా విడుదలైన “ది చోర సాంగ్”ను మీరు కూడా వీక్షించండి.