Raja Kumari : మ్యూజిక్ డైరెక్టర్‌గా సింగర్ రాజకుమారి.. ‘ఇంప్యూర్’ తో సెన్సేషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ఫైర్ స్ట్రోమ్ సాంగ్ విన్నారా? షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఇంటర్నేషనల్ పాప్ సెన్సేషన్, అమెరికన్ ర్యాపర్ రాజకుమారి అందరికీ సుపరిచితమే. తన గొంతుతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే ఈ గ్లోబల్ స్టార్.. ఇప్పుడు ఏకంగా ఓ కొత్త అవతారం ఎత్తారు. తెలుగు ఇండస్ట్రీలోకి ఆమె ఏకంగా ‘సంగీత దర్శకురాలిగా’ (మ్యూజిక్ డైరెక్టర్) అడుగుపెట్టడం ఇప్పుడు టాలీవుడ్లో సెన్సేషనల్ టాపిక్‌గా మారింది.
అమెరికాలో స్థిరపడిన తెలుగమ్మాయి వారాహి మల్లిపాముల ప్రధాన పాత్రలో నటిస్తూ, తన తల్లి శ్రీదేవి మల్లిపాములతో కలిసి నిర్మిస్తున్న ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ ‘ఇంప్యూర్’ (Impure). ఈ విభిన్నమైన చిత్రంతోనే రాజకుమారి మ్యూజిక్ డైరెక్టర్‌గా సినీ ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన ‘ఓఎంజీ’ (OMG – ఓ మై గాడ్) సంగీత్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. కడలి సత్యనారాయణ అందించిన అద్భుతమైన తెలుగు లిరిక్స్ కు రాజకుమారి తనదైన స్టైల్ లో వాయిస్ తో పాటు మ్యూజిక్ అందించి ప్రాణం పోశారు. పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ సాంగ్ తర్వాత రాజకుమారి పాడిన తెలుగు పాట ఇదే కావడం విశేషం. అంతేకాదు, ఈ సినిమాలో రాజకుమారి ఒక స్పెషల్ గెస్ట్ రోల్ లో కూడా నటించి స్క్రీన్ పై తళుక్కున మెరవనున్నారు!
Also Read
- Balakrishna - Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
యష్న, వారాహి, సాయి కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ అభిజీత్, కిరీటి దామరాజు, ఆర్జే కాజల్, శ్రీవాణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ వీఎస్ అద్భుతమైన విజువల్స్ అందించారు. అశుతోష్ మతేల, రామకృష్ణ ఆరమ్ ఎడిటింగ్ బాధ్యతలు చూసుకున్నారు. రాజకుమారితో పాటు కరణ్ పాండవ్ కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించగా.. కరణ్ పాండవ్, నిర్వాణ్ ఆత్రేయ ఒరిజినల్ స్కోర్ అందించారు.’ఇంప్యూర్’ గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
-
OTR : ఖైరతాబాద్ బీజేపీ అభ్యర్థిగా చింతల రామచంద్రారెడ్డి.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!