NTV Telugu Site icon

Raj Tarun – Lavanya Case : లావణ్య కేసులో రాజ్ తరుణ్ మెడకు బిగుస్తున్న ఉచ్చు..?

Ae493943 0759 41d9 B13f 50ce4d57c9a8

Ae493943 0759 41d9 B13f 50ce4d57c9a8

రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం ఆ మధ్య సంచలనం  రేపిన సగంతి తెలిసిందే. తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి, శారీరకంగా వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో గడుపుతూ, నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్య కు డ్రగ్స్ అలవాటు ఉంది, ఆమెకు నాకు ఎటువంటి సంబంధం లేదు, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు, గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించింది. డబ్బుకోసమే ఇదంతా చేస్తుందని ఆరోపించాడు రాజ్ తరుణ్.

Also Read: Nani Comments : శనివారం మాత్రమే రెచ్చిపోయేవాడిని శనివారమోడు అంటారు : నాని

తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.  తరుణ్- లావణ్య కేసులో న నార్సింగి పోలీసుల ఛార్జ్షీట్ దాఖలు చేసారు. ఆ ఛార్జ్షీట్లో రాజ్తరుణ్ను నిందితుడిగా చేర్చారు , లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించారు పోలీసులు, మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు హీరో రాజ్తరుణ్. లావణ్యతో పాటు రాజ్తరుణ్ పదేళ్లు సహజీవనం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారిని, లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయన్నారు నార్సింగి పోలీసులు.

Also Read: Mythri Official : వరద భాదితుల సహాయార్ధం సీఎం రిలీఫ్ ఫండ్ కు టాలీవుడ్ నిర్మాతల విరాళం..

ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య NTVతో మాట్లాడుతూ ” మా ఇద్దరికీ గతంలో పెళ్లైంది, గుడిలో నాకు రాజ్ తరుణ్ తాళి కట్టాడు, మా పెళ్ళికి సంబందించిన ఫోటోలు నా దగ్గర ఉన్నాయి, రాజ్ వలన గర్భం కూడా దాల్చాను, కొందరు తమను విడగొట్టాలని చూస్తున్నారు, పోలీసుల ఛార్జ్ షీట్ దాఖలు చేసినందుకు సంతోషంగా ఉంది, చివరికి ధర్మమే గెలిచింది, అతనికి షాలిని పాండే, అరియనా తో అఫైర్ ఉంది, కానీ రాజ్ అంటే నాకు ప్రాణం, రాజ్ తరుణ్ నా భర్త ” అని తెలిపింది లావణ్య.

Show comments