NTV Telugu Site icon

Raj Tarun : లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మరో ట్విస్ట్.. ఈసారి ట్విస్ట్ వేరే లెవల్..

Untitled Design (8)

Untitled Design (8)

రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం నరంతర డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో గడుపుతూ, నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్య కునాకు సంభందం లేదు, ఆమె ఆరోపణల్లో వాస్తవం లేదు, ఆమె డ్రగ్స్ బానిస, కేవలం డబ్బు కోసమే ఇదంతా చేస్తుంది అని రాజ్ తరుణ్ వాదన.

Also Read : Biggest Multistarrer : మహేశ్.. రజనీకాంత్.. రామ్ పోతినేని.. ఫిక్స్ ?

ఇటీవల నార్సింగి పోలీసుల లావణ్యతో రాజ్ తరుణ్ గడిపిన వాటికి సంబంధించి లావణ్య ఇంటి వద్ద సాక్ష్యాలు సేకరించి, రాజ్తరుణ్ పై ఛార్జ్షీట్ దాఖలు చేసి నిందితుడిగా చేర్చారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ తీసుకున్నాడు రాజ్ తరుణ్. తాజగా ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. తన బంగారం, పుస్తెల తాడు, తాళి బొట్టు రాజ్ తరుణ్ దొంగిలించాడని నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది లావణ్య. గోల్డ్ కొనుగోలు చేసిన జ్యువెలరీ షాప్ బిల్స్ తో సహా పీఎస్ కి వచ్చిన లావణ్య.. నగలు బీరువాలో దాచానని, ఆ బీరువా లాక్ రాజ్ తరుణ్ తోనే ఉందని, నాకు తెలియకుండా రాజ్ తరుణ్ దొంగిలించాడని అందుకు సంబంధించిన అనేక ఆధారాలు కూడా ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య

Show comments