యంగ్ హీరో నాగశౌర్యను స్టార్ హీరో రానా హెచ్చరించాడు. ఇటీవల నాగశౌర్య సీనియర్ నటుడు బ్రహ్మాజీతో కలిసి ఉన్న ఒక పిక్ ను షేర్ చేస్తూ “నా తమ్ముడు బ్రహ్మాజీ కొత్తగా పరిశ్రమకి వచ్చాడు. మీ అందరి సపోర్ట్ తనకి ఉండాలి. దయచేసి యువ ప్రతిభను సపోర్ట్ చేయండి” అంటూ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బ్రహ్మాజీ స్పందిస్తూ “నన్ను సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు అన్నా.. నువ్వు టాలెంట్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నావ్” అంటూ రిప్లై ఇచ్చారు. వీరిద్దరి ట్విట్టర్ సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రానా దగ్గుబాటి కూడా లైన్లోకి వచ్చాడు.
Read Also : రాజ్ కుంద్రా కేసులో మనీ లాండరింగ్ కోణం
నాగ శౌర్య ట్వీట్‌పై స్పందిస్తూ “వామ్మో !! ఇది ఏంటి గురూ !! నాగ శౌర్య దయచేసి జాగ్రత్తగా ఉండండి !! బ్రహ్మజీ ఆ లుక్‌లో ఏదో అనుమానంగా కనిపిస్తున్నాడు. ఏమంటావు??” అంటూ ఫన్నీగా హెచ్చరించారు. కాగా నాగశౌర్య, బ్రహ్మాజీ ఇద్దరూ కలిసి అనీష్ కృష్ణ దర్శకత్వం వహించబోయే చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇటీవలే హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.
