Site icon NTV Telugu

Raghu kunche : గేదెల రాజుగా వస్తున్న రఘు కుంచే

Gedela Raju

Gedela Raju

సంగీత దర్శకుడుగా సూపర్ హిట్ సినిమాలు అందించిన రఘు కుంచే ఇటీవల కాలంలో లీడ్ రోల్ లో పలు సినిమాలలో నటించారు.  పలాస వంటి సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ లో ఆకట్టుకున్నాడు రఘు కుంచే. తాజాగా నిర్మాత, నటుడు రఘుకుంచే టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘గేదెలరాజు’. ‘కాకినాడ తాలుకా’ అనేది సినిమా సబ్‌టైటిల్‌. నూతన దర్శకుడు చైతన్య మోటూరి దర్శకత్వంలో లవ్‌ అండ్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతుంది.

Also Read : Game Changer : ‘గేమ్ ఛేంజర్’ ఇన్ సైడ్ టాక్.. సోషల్ మీడియా షేక్

కాకినాడ దగ్గరలో జరిగిన యాదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రఘుకుంచే సమర్పిస్తుండగా వాణి రవికుమార్‌ మోటూరి నిర్మాత. రవి చిన్నబిల్లి, వీరభద్రరావు తడాల సహ నిర్మాతలు. రామచంద్రమ్‌ పుణ్యమంతుల,టీనా శ్రావ్య, శ్రీదివ్య, వికాస్, మౌనిక, రవి చిన్నబిల్లి ముఖ్యపాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం టైటిల్‌లాంచ్‌ ఎనౌన్స్‌మెంట్‌ను హైదరాబాద్‌లో చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ప్రస్తుతం కాకినాడ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. శ్రీకాంత్‌ అయ్యంగార్, మెహబూబ్‌ భాషా, కిట్టయ్య తదితరులు నటిస్తున్నారు. అనేక ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌తో తయారవుతున్న ఈ సినిమాకి సంగీతం రఘుకుంచే అందిస్తుండగా, డిఓపి గా సాయికుమార్‌ వ్యవహరిస్తున్నారు. కథ,కథనం, మాటలు, దర్శకత్వం చైతన్య మోటూరి వహిస్తున్నారు.

Exit mobile version