NTV Telugu Site icon

Raghava Lawrence : ఆ సూపర్ హిట్ సినిమా రీమేక్ లో రాఘవ లారెన్స్..?

Untitled Design (25)

Untitled Design (25)

రాక్షసుడు, ఖిలాడీ సినిమాలను తెరకెక్కించిన రమేష్‌వర్మతో ముచ్చటగా మూడో సినిమా చేయనున్నారు నిర్మాత కోనేరు సత్యనారాయణ. రాఘవ లారెన్స్ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఎ స్టూడియోస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నీలాద్రి ప్రొడక్షన్స్, హవీష్‌ ప్రొడక్షన్స్ కలిసి ఐ ఓ సినిమా నిర్మిస్తున్నట్టు ఇటీవల ప్రకటించారు. రాఘవ లారెన్స్ సినీ కెరీర్ లో 25వ సినిమాగా రానుంది ఈ చిత్రం. న‌వంబ‌ర్‌లో షూటింగ్‌ను ప్రారంభించి 2025 స‌మ్మ‌ర్‌లో విడుద‌ల చేయ‌టానికి మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Also Read : Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు..

ఇదిలా ఉండగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర వార్త సినిమా సర్కిల్స్ లో వినిపిస్తుంది. ఇటీవల వరుస సక్సెస్‌ల మీదున్న రాఘవ లారెన్స్. తన కెరీర్ లో ల్యాండ్ మార్క్ మూవీగా రానున్నఈ సినిమా రీమేక్ అని తెలుస్తోంది. బాలీవుడ్ లో రీసెంట్ గా విడుదలై సూపర్ హిట్ సాధించిన కిల్ (KILL). ఎటువంటి హైప్, బజ్ లేకుండా చిన్న సినిమాగా రిలీజై భారీ విజయం సాధించింది కిల్. ఒక రాత్రి పూట ట్రైన్ లో జ‌రిగే సంఘ‌ట‌న ఆధారంగా రూపొందిన ఈ యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్  బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. అప్పట్లో ఈ టాలీవుడ్ హీరోలు సుధీర్ బాబు, సందీప్ కిష‌న్, కిర‌ణ్ అబ్బ‌వ‌ర ఈ సినిమాను రీమేక్ చేయాలని భావించారు. కానీ అది వర్కౌట్ అవలేదు. ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో లారెన్స్ హీరోగా రీమేడ్ కానుంది. ఒకవైపు లారెన్స తన స్వీయ దర్శకత్వం వహిస్తున్న కాంచన -4 ను తెరకెక్కిస్తూనే ఈ రిమేక్ సినిమాలో కూడా లారెన్స్ నటించబోతున్నాడని కోలీవుడ్ కోడై కూస్తోంది.

Show comments