Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raghava Lawrence: సినిమా ఇండస్ట్రీలో ఒక సెంటిమెంట్ ఉంది.. కొన్ని కథలు ఎన్నిసార్లు చర్చకు వచ్చినా తెరపైకి రావడం అంత సులువు కాదు. అందులోనూ ‘కర్ణ’ చరిత్ర ఒకటి. కోలీవుడ్ అగ్ర కథానాయకులు సైతం చేతులు కాల్చుకుని పక్కనపెట్టిన ఈ మైథాలజీ సబ్జెక్ట్‌ను, ఇప్పుడు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాఘవ లారెన్స్ భుజాన ఎత్తుకోవడం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు స్టార్ హీరోలే రిస్క్ అని వెనక్కి తగ్గిన కథతో లారెన్స్ నెగ్గుకురాగలడా? లేక ఇది కూడా లైనప్‌లో మిగిలిపోయే మరో ప్రకటన మాత్రమేనా? అనే సందేహాలు స్టార్ట్ అయ్యాయి. గతంలో విలక్షణ నటుడు చియాన్ విక్రమ్ హీరోగా ఆర్.ఎస్.విమల్ డైరెక్షన్లో ‘మహావీర్ కర్ణ’ ప్రాజెక్ట్ మొదలైంది. ఏకంగా టైటిల్ టీజర్ వదిలి సంచలనం సృష్టించారు. వందల కోట్ల బడ్జెట్, భారీ విజువల్స్ అనుకున్నప్పటికీ ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా అటకెక్కింది. ఆ తర్వాత స్టార్ హీరో సూర్యతో బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా రెండు పార్ట్లు కర్ణుడి కథను తీయాలని భావించారు. అయితే భారీ నిర్మాణ వ్యయం కారణంగా ఆ సినిమా పట్టాలెక్కే ముందే ఆగిపోయింది. ఇలా కోలీవుడ్ అగ్ర హీరోలు సైతం ధైర్యం చేయలేక వదిలేసిన ఈ ప్రయోగాన్ని, ఇప్పుడు లారెన్స్ ‘మహావీర్ కర్ణ’ పేరుతో తెరపైకి తెస్తుండటం నిజంగానే ఒక సెన్సేషన్‌గా మారింది.
హారర్ కామెడీ, మాస్ యాక్షన్ జానర్లతో తనకంటూ ఒక స్పెషల్ ఇమేజ్ తెచ్చుకున్న లారెన్స్, ఈసారి ఏకంగా పౌరాణిక బాట పట్టారు. టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మ సారథ్యంలో పెన్ స్టూడియోస్, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్, ఆర్వీ స్టూడియోస్ సంయుక్తంగా రూ. 150 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 2027లో సినిమా రిలీజ్ అవుతుందని పోస్టర్ ద్వారా ప్రకటించారు. అయితే లారెన్స్ మార్కెట్‌కు మించి ఇంత భారీ మొత్తం పెట్టడం, అందులోనూ హిస్టరీ లేని మైథాలజీ జానర్‌ను ఎంచుకోవడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. లారెన్స్ నుంచి సినిమా వచ్చి మూడేళ్లు గడుస్తున్నా, లైనప్ చూస్తే ఐదారు ప్రాజెక్ట్‌లతో డైరీ ఫుల్లుగా ఉంది. గతంలో రమేష్ వర్మ కాంబినేషన్లోనే ‘కాలభైరవ’ అనే సూపర్ హీరో సినిమా ఫస్ట్ లుక్ ఇచ్చారు. కానీ ఆ ప్రాజెక్ట్ ప్రస్తుత పరిస్థితి ఏంటో స్పష్టత లేదు. ఇక బ్రాండ్ ఇమేజ్ ఉన్న ‘కాంచన-4’ అయితే నయనతార, పూజా హెగ్డేల కాల్షీట్ల సమస్యతో వాయిదాల మీద వాయిదాలు పడుతోంది. వీటితో పాటు ‘బెంజ్’, ‘బుల్లెట్’, ‘అధికారం’, ‘హంటర్’ లాంటి చిత్రాలు కూడా వరుసలో ఉన్నప్పటికీ ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో కొలిక్కి రావడం లేదు. కొత్త ప్రాజెక్ట్‌ల ప్రకటనలు ఇవ్వడం తప్ప, సెట్స్ పైకి వెళ్లి ఎప్పుడు థియేటర్లలోకి వస్తారనే దానిపై స్పష్టత లేకపోవడంతో అభిమానుల్లోనూ అసహనం పెరుగుతోంది. అగ్ర హీరోలే వదిలేసిన కర్ణుడి కథతో లారెన్స్ నిజంగానే అద్భుతం సృష్టిస్తాడా? లేక ఇది కూడా సెట్స్‌పైకి వెళ్లని మరో ప్రయోగంగానే మిగిలిపోతుందా అన్నది కాలమే తేల్చాలని అంటున్నారు.
Also Read
తాజావార్తలు
-
Raghava Lawrence: సూర్య, విక్రమ్లకే సాధ్యం కాని సాహసం.. లారెన్స్ చేతులెత్తేస్తాడా? లేక చరిత్ర తిరగరాస్తాడా?
-
Khairatabad Ganesh : ఖైరతాబాద్‌లో షీ టీమ్స్ ఫుల్ ఫోకస్.. 1,100 కేసులు.!
-
Rahul Gandhi: ఇందిరా ఓడిపోయింది, బీజేపీ ఎందుకు ఓడిపోవడం లేదు.
-
Air India Offer: ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్.. విమాన ఛార్జీలపై 10 శాతం డిస్కౌంట్..
-
TRAI New Rules: జియో, ఎయిర్టెల్, వీఐలకు ట్రాయ్ షాక్! అక్టోబర్ 21 నుంచి చౌకైన రీఛార్జ్ ప్లాన్లు..
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!