Site icon NTV Telugu

Raghava Lawrence: నేను భయపెడతాను.. మీరు భయపడతారు..

Larence

Larence

Raghava Lawrence: రాఘవ లారెన్స్ స్వయంగా తానే కథ రాసి దర్శకత్వం వహించిన చిత్రం ముని.. 2007లో విడుదలైన ఈ మూవీ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది. ఆ తర్వాత చాల గ్యాప్ ఇచ్చి ముని చిత్రానికి కొనసాగింపుగా 2011లో కాంచన చిత్రాన్ని తీసుకువచ్చాడు.. కాంచన అటు తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేశాడు. రెండు భాషల్లోనూ కాంచన ఘన విజయం సాధించింది. ముఖ్యంగా అర్థనారీశ్వరి పాత్రలో లారెన్స్ నటన ప్రతీ ఒక్కరిని విశేషంగా ఆకట్టుకుంది. కాంచన ఎండ్ లో సీక్వెల్ గా కాంచన -3ని ప్రకటించాడు. అందులో భాగంగానే కాంచనలో మూడవ భాగాన్ని 2015లో గంగా పేరుతో తీసుకువచ్చాడు. ఈ చిత్రాన్ని కూడా అటు తమిళ్ ఇటు తెలుగులో విడుదల చేసి మంచి కలెక్షన్స్ రాబట్టాడు. ఆ చిత్రం ఎండ్ టైటిల్స్ లో కాంచన -4 రాబోతుందని రాఘవ లారెన్స్ అనౌన్స్ చేసాడు.

Read Also: Sandeshkhali Case: సందేశ్‌ఖలీ కేసులో మమత బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్ట్ బిగ్ షాక్..

కానీ, అది చాలా కాలంగా కార్యరూపం దాల్చలేదు. కాంచన సీరిస్ కు కొన్నాళ్ళు బ్రేక్ ఇచ్చి.. పలు చిత్రాలలో హీరోగా నటించాడు లారెన్స్. కాగా లాంగ్ గ్యాప్ తర్వాత కాంచన -4ను తీసుకురాబోతున్నట్టు ప్రకటించాడు రాఘవ లారెన్స్. కాంచన -4 కు సంబంధించి కథ మొత్తం పూర్తైందని, ఈ సారి స్క్రిప్ట్ చాల బాగా వచ్చిందని, మునుపటి కంటే ఎక్కువ భయపెడతానని, ప్రేక్షకులను తప్పకుండా కాంచన -4 అలరిస్తుందని లారెన్స్ తాజాగా ఓ ఇంటర్వూలో తేలిపాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని కార్యక్రమాలు ముగించి.. సెప్టెంబరు నాటికి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టు చెన్నై సినీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహించి నటీనటులు ఇతర టెక్నిషియన్ల వివరాలు వెల్లడిస్తారని వినికిడి. ఇంకా ఈ సీరిస్ లో ఎన్ని చిత్రాలు నిర్మిస్తాడో, ప్రేక్షకులను ఎంతగా భయపెడతాడో అనేది వేచి చూడాలి.

Exit mobile version