ఆర్కే నాయుడుగా ఒక తెలుగులో రేంజ్ గుర్తింపు తెచ్చుకున్న సాగర్ నటించిన ‘ది 100’ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్‌గా ఓంకార్ శశిధర్ దర్శత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమా విడుదలకు ముందే పలు పురస్కారాలను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకోగా తాజాగా ఈ సినిమా దర్శకుడు ఓంకార్ శశిధర్ తన గురువు కృష్ణ వంశీ గురించి పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ‘నేను దర్శకత్వం వహించిన తొలి మూవీ “ది 100” అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులు అందుకుంది.
Big Boss 8 Telugu Winner: బిగ్‌బాస్ సీజన్-8 విజేతగా నిఖిల్
నా సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ మేకింగ్, టేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంత అర్ధవంతమైన కథను రూపొందించడం, పాత్రలను సృష్టించడం వెనుక పూర్తిగా నా గురువు కృష్ణవంశీ ఉంటారు. ఆయన్నుంచి ప్రేరణ పొందే ఇలాంటి కథ, క్యారెక్టర్లను డిజైన్ చేసుకున్నా, ఆయన దగ్గర నేను నేర్చుకున్న విలువలు, కథలు చెప్పే విధానమే ఈ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయ, ఈ విజయాన్ని వందశాతం నా గురువుకి అంకితం చేస్తున్నానని అంటూ ఆయన చెప్పుకొచ్చారు. త్వరలోనే ఈ సినిమాను మీ అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, మీ అందరి ఆశీస్సులు, సపోర్ట్ నాకు అందిస్తారని కోరుకుంటున్నా. నాకు మార్గదర్శకంగా నిలిచినందుకు కృష్ణ వంశీకి కృతజ్ఞతలు’ అంటూ పోస్ట్ చేశారు.