బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘రాధే’. ‘యువర్ మోస్ట్ వాంటెడ్ బాయ్’ అనేది ట్యాగ్ లైన్. ‘రాధే’కు ప్రభుదేవా దర్శకత్వం వహించారు. సల్మాన్ ఖాన్, సోహైల్ ఖాన్, అతుల్ అగ్నిహోత్రి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో రణదీప్ హుడా, జాకీ ష్రాఫ్, మేఘా ఆకాష్ కీలక పాత్రల్లో నటించారు. ‘రాధే’ను థియేటర్లలో, డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఒకేసారి విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈద్ కానుకగా ‘రాధే’ 13 మే 2021న థియేటర్లలోకి రానుంది. సోమవారం రోజు ‘రాధే’ నుంచి ‘సీటిమార్’ వీడియో సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ పాటకు సల్మాన్ అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తుండగా… కొంతమంది నుంచి మాత్రం విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘రాధే’ హీరోయిన్ దిశా పటాని ‘సీటిమార్’ సాంగ్ బిటిఎస్ (బిహైండ్ ది సీన్) వీడియోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి. కాగా ‘సీటీమార్’ సాంగ్ అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రంలోనిది. ఒరిజినల్ ట్రాక్‌ని కంపోజ్ చేసిన డీఎస్పీ ఈ సాంగ్ ను హిందీలో రీమేక్ చేశారు.
https://www.instagram.com/p/COKBHesDM1a/?utm_source=ig_embed
https://www.instagram.com/reel/COKE1KTgU6E/?utm_source=ig_embed