NTV Telugu Site icon

Rachakonda CP: కేసు వేసిన వ్యక్తిని కలిసిన మోహన్ బాబు.. చర్యలు తప్పవు!

Mohanbabu

Mohanbabu

మోహన్ బాబు ఫ్యామిలీ వివాదంపై రాచకొండ సిపి స్పందించారు. ఇప్పటికే మంచు కుటుంబం పై 3 ఎఫ్ఐఆర్ లు నమోదు అయ్యాయి అని అన్నారు. వాటిపై ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని పేర్కొన్న ఆయన లీగల్ గా మేము ఏమి చేయాలో అది చేస్తామని అన్నారు. మోహన్ బాబుకు ఇప్పటికే నోటీసులు ఇచ్చామని, 24 వరకు టైం అడిగారని అన్నారు. కోర్టు టైం ఇచ్చింది కాబట్టి మేము అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. మోహన్ బాబు విచారణ పై మేము కూడా కోర్టును అడుగుతామని అన్నారు.

Sritej: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే?

మోహన్ బాబు వద్ద గన్ లు చంద్రగిరిలో ఉన్నపుడు తీసుకున్నాడని, రాచకొండ నుండి ఎలాంటి పర్మిషన్ గన్స్ లేవని అన్నారు. మోహన్ బాబు వద్ద 2 గన్స్ ఉన్నాయని, ఒక డీబీపీఎల్, మరొకటి స్పానిష్ మేడ్ గన్ ఉందని అన్నారు. మళ్ళీ నోటీసులు ఇచ్చాక మోహన్ బాబు అటెండ్ అవ్వాలని ఆయన అన్నారు. మళ్ళీ టైం కావాలి అంటే పర్మిషన్ తీసుకోవాలని, లేదంటే వారంటీ ఇష్యు చేస్తామని అన్నారు. మోహన్ బాబు నిన్న వెళ్లి పిటిషనర్ ను కలిశాడని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

Show comments