NTV Telugu Site icon

Manchu Case : మోహన్ బాబు కేసుపై స్పందించిన రాచకొండ సీపి సుధీర్‌బాబు

Mohanbabu

Mohanbabu

మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారితీసిన సంగతి తెలిసిందే. మనోజ్ కు మోహన్ బాబు మధ్య మొదలైన వివాదం మీడియాపై జరిగిన దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. దాడి నేపథ్యంలో మోహన్ బాబు పై పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.అలాగే మంచు మనోజ్, మంచు విష్షు ఇరువురు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్ పల్లిలో హంగామా సృష్టించారు. ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకోవడంతో రంగంలోకి దిగిన పోలీసులు మంచు ఫ్యామిలీకి హెచ్చరికలు జారీ చేసారు.

Also Read : ErraCheera : రాజేంద్రప్రసాద్ మనవరాలి సినిమా శివరాత్రికి రిలీజ్

తాజగా ఈ కేసు వ్యవహారంపై హైదరాబాద్ సీపి సుధీర్‌బాబు స్పందించారు. అయన మాట్లాడుతూ ‘మోహన్ బాబు కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరం లేదు. మోహన్ బాబు వాళ్ళు టైం అడిగారు. మేము ఇచ్చిన ఆ టైం తరువాత అవసరమైన చర్యలు చేపడతాము. అవసరమైతే మోహన్ బాబుకు మరోసారి నోటీసులు జారీ చేస్తాము.
ఇక నుండి బౌన్సర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదు. ఎంతటి వారైనా సరే ఉపేక్షించేది లేదు. బౌన్సర్లకు ప్రత్యేక గైడ్లైన్సును రూపొందిస్తాము. దానికనుగుణంగా అందరు నడుచుకోవాలి. బౌన్సర్లు తోపులాటలు చేసి భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తే ఊరుకోము’ అని హెచ్చరించారు. మరోవైపు మోహన్ బాబు హై కోర్ట్ లో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా కోర్టు తిరస్కరించిన సంగతి విదితమే. రానున్న రోజుల్లో ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.