Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raaz Actress: ఒకప్పుడు భయంకరమైన లుక్‌తో ప్రేక్షకులను వణికించిన ‘రాజ్’ సినిమా నటి మాలినీ శర్మ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచారు. దాదాపు రెండు దశాబ్దాలుగా బాలీవుడ్‌కు దూరంగా ఉంటున్న మాలినీ శర్మ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారారు. ఆమెను గుర్తుపట్టిన అభిమానులు పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్, మెసేజ్‌లు చేయడంతో ఆమె కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు ఇంతకాలం మాలినీ శర్మ ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు?
2002లో విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ ‘రాజ్’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. బిపాషా బసు, డినో మోరియా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలో మాలినీ శర్మ దెయ్యం పాత్రలో హల్చల్ చేసింది. పెద్దగా డైలాగ్స్ లేకపోయినా, ఆమె లుక్, హావభావాలు, భయపెట్టే స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకుల ఒంట్లో వణుకు పుట్టించాయి. దీంతో ఆ సినిమా చూసిన చాలామందికి మాలినీ శర్మ పోషించిన దెయ్యం పాత్ర ఇప్పటికీ గుర్తుండిపోయింది.
Also Read
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అయితే ‘రాజ్’ తర్వాత మాలినీ శర్మ కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో కొనసాగలేదు. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె, సినిమాల్లోకి రాకముందు పలు మ్యూజిక్ వీడియోల్లోనూ కనిపించారు. ‘ఆప్కే ప్యార్ మే’ వంటి పాటల్లో కనిపించి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘క్యాట్స్’ అనే టీవీ సిరీస్‌లో కూడా నటించారు. కానీ బాలీవుడ్లో ఎక్కువకాలం కొనసాగకుండా ఆమె క్రమంగా సినిమాలకు దూరమయ్యారు.
సినీ ప్రపంచానికి దూరమైన తర్వాత మాలినీ శర్మ తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నారు. సినిమా షూటింగ్స్, కెమెరాలు, గ్లామర్ ప్రపంచానికి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన లైఫ్ స్టైల్ ను గడుపుతున్నారు. ప్రస్తుతం పూణే సమీపంలోని సహ్యాద్రి కొండల్లో ‘ది స్లో లోకల్’ అనే ఫామ్స్టేను నిర్వహిస్తున్నారు. ప్రకృతి మధ్య ప్రశాంతంగా గడపాలనుకునే వారికి ఈ ఫామ్స్టే ఒక ప్రత్యేక అనుభూతిని అందించేలా ఉంటుంది.
ఇటీవల సోషల్ మీడియాలో మాలినీ శర్మకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు ఆమెను ‘రాజ్’ సినిమాలోని దెయ్యం పాత్రతో పోల్చుకుంటూ గుర్తుపట్టారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఫామ్స్టేకు ఫోన్ కాల్స్, మెసేజ్‌లు వెల్లువెత్తాయి. ఇంత భారీ స్థాయిలో స్పందన వస్తుందని తాను ఊహించలేదని మాలినీ శర్మ స్వయంగా వెల్లడించారు. ఈ అభిమానానికి స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేసిన మాలినీ శర్మ, తాను ఎంతో సంతోషంగా ఉన్నానని, ఇంత ప్రేమను చూసి తరువాత తన భావాలను మాటల్లో చెప్పలేకపోతున్నానని భావోద్వేగానికి గురయ్యారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తనకు భారీగా మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. వీలైనంతవరకు ప్రతి ఒక్కరికీ స్పందించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. దాదాపు 20 ఏళ్లకు పైగా సినీ ప్రపంచానికి దూరంగా ఉన్న ఆమెను అభిమానులు మళ్లీ గుర్తు చేసుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిగా ఉందని మాలినీ శర్మ స్పందించారు.
ఒకప్పుడు ‘రాజ్’ సినిమాలో దెయ్యంగా ప్రేక్షకులను భయపెట్టిన మాలినీ శర్మ, ఇప్పుడు అదే సినీ ప్రపంచానికి పూర్తిగా భిన్నమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. కెమెరాల ముందు కనిపించకుండా ప్రకృతి మధ్య ఫామ్స్టే నిర్వహిస్తూ తనకంటూ మరో ప్రపంచాన్ని నిర్మించుకున్నారు. అయితే సోషల్ మీడియా కారణంగా ఆమె గతం మరోసారి అందరి ముందుకు వచ్చింది. దీంతో మాలినీ శర్మ పేరు ప్రస్తుతం మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చింది.
- Tags
- cinema
- Malini Sharma
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..