టోక్యో ఒలింపిక్స్ 2021లో హైదరాబాద్‌కు చెందిన భారతీయ షట్లర్ పివి సింధు కాంస్య పతకం సాధించింది. ఆమె చైనాకు చెందిన హి బింగ్జియావోను 2 వరుస సెట్లలో ఓడించింది. సింధు ఇప్పుడు వ్యక్తిగత విభాగంలో రెండు పతకాలు సాధించిన రెండవ భారతీయ అథ్లెట్. ఈ మ్యాచ్‌లో విజయంతో ఆమె అరుదైన ఘనతను సాధించింది. కాంస్య మ్యాచ్‌లో సింధు చారిత్రాత్మక విజయం సాధించినందుకు అభినందన సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. “సింధు అద్భుతమైన విజయంతో మేమంతా ఉల్లాసంగా ఉన్నాము. టోక్యో 2020లో కాంస్య పతకం సాధించినందుకు ఆమెకు అభినందనలు. ఆమె భారతదేశానికి గర్వకారణం. మా అత్యుత్తమ ఒలింపియన్లలో ఒకరు” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. భారతదేశానికి రెండవ పతకం సాధించిన సింధుకు టాలీవుడ్ నుంచి కూడా అభినందనల వెల్లువ మొదలైంది.
తెలుగు తేజం పీవీ సింధుకు టాలీవుడ్ అభినందనలు
