NTV Telugu Site icon

AlluArjun : పుష్ప 2లో ఆ మూడు బ్లాకులు అదిరిపోతాయట

Pushpa2

Pushpa2

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులు ముందుకు రాబోతున్న చిత్రం పుష్ప 2. పుష్ప 1కు సీక్వెల్ గా ఈ చిత్రం రాబోతుంది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రావడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా నవీన్ నూలి ఎడిటర్ గా ఈ చిత్రానికి పనిచేయడం మరింత విశేషం. సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Also Read : DaakuMaharaajEvent : డల్లాస్ లో ‘డాకు మహారాజ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఈ సినిమాపై టాలీవుడ్ లో ఓ ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ సినిమాలోని ఓ మూడు బ్లాకులు అదిరిపోతాయట. సినిమాలో కీలకంగా వచ్చే ఆ సీన్స్ నినిమాకే హైలెట్ గా నిలుస్తాయని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో పుష్పరాజ్ వార్నింగ్ ఇచ్చే సీన్ ఉంటుందట. ఈ సీన్ ఫ్యాన్స్ తో విజిల్ కొట్టిస్తుందట. అలాగే ప్రీ క్లైమాక్స్ఎపిసోడ్ కు అదిరిపోవడం ఖాయం అని అంటున్నాయి యూనిట్ వర్గాలు. మరీముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే దాదాపు 20 నిమిషాల పాటు సాగే  జాతర ఫైట్ కు థియేటర్స్ ఊగిపోతాయని చర్చించుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. మొత్తానికి సుకుమార్ ఈ సీక్వెల్ ను గట్టిగా ప్లాన్ చేసాడని ఈ సినిమా ఒక విజువల్ ట్రీట్ అని కూడా చర్చించుకుంటున్నారు. మరి డిసెంబరు 5న విడుదల కానున్న పుష్ప – 2 ఎంతటి సంచలనాలు నమోదు చేస్తుందో మరి కొద్ది రోజుల్లో తేలనుంది.

Show comments