NTV Telugu Site icon

Pushpa2TheRule : జెట్ స్పీడ్ లో పుష్ప రాజ్.. డిసెంబర్ 6న బాక్సాఫీస్ బద్దలే

Untitled Design (1)

Untitled Design (1)

స్టైలిస్ట్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాకు కొనసాగింపుగా పుష్ప 2 సినిమా రానున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్ రష్మిక నటిస్తోంది. 2021 తర్వాత బన్నీని స్క్రీన్ పై చూడలేదు ఫ్యాన్స్. దీంతో పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటు టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్,శాండల్ వుడ్, మాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు.

Also Read: NBK50Years : నందమూరి బాలయ్య స్వర్ణోత్సవ వేడుకల అతిధుల లిస్ట్ ఇదే..

వాస్తవానికి పుష్ప – 2 ఈ ఆగష్టు 15న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల ఈ సినిమా విడుదల డిసెంబర్ 6 కి వాయిదా పడింది. కానీ పుష్ప మరోసారి వెనక్కి వెళ్తాడు అనే రూమర్స్ వినిపించాయి. దీనిపై నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ మాట్లాడుతూ ” డిసెంబ‌రు 6న పుష్ష 2 రావ‌డం ఫిక్స్. దీనికి సంబంధించిన కౌంట్ డౌన్ పోస్టర్ ను రిలీజ్ చేస్తున్నాం అంతే కాదు. ఒక‌రోజు ముందు, అంటే డిసెంబ‌రు 5న ప్రీమియ‌ర్లు కూడా వేస్తున్నాం, సెప్టెంబ‌రు 2 నాటికి ఫ‌స్టాఫ్ ఎడిటింగ్ వెర్ష‌న్ పూర్తి చేస్తామ‌ని, అక్టోబ‌రు 6 క‌ల్లా సెకండాఫ్ కూడా అయిపోతుంది, న‌వంబ‌రు 20కి కాపీ పూర్త‌వుతుంది. న‌వంబ‌రు 25కి సెన్సార్ కూడా పూర్తి చేస్తాం. ఈ సినిమాకి సంబంధించి ఇంకా పాటలు ఇవ్వాల్సి ఉంది.. అక్టోబ‌రులో ఒక‌టి, న‌వంబ‌రులో ఇంకో పాట విడుద‌ల చేస్తాం” అని అన్నారు. మరోవైపు పుష్ప థియేట్రికల్ బిజినెస్ ఎవరు ఊహించని రేంజే లో జరుగుతోంది. ఈ చిత్రంలో ఐటమ్ సాంగ్ లో ఎవరు కనిపిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు

Show comments