Site icon NTV Telugu

Pushpa 2 The Rule:టాలీవుడ్లో పుష్ప 2 మరో రికార్డు

Pushparaj

Pushparaj

టాలీవుడ్ హిస్టరీలో పుష్ప 2 సినిమా మరో సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పుష్ప 2 సినిమాకి సంబంధించిన టీజర్ తెలుగు సినీ పరిశ్రమలోనే 150 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించిన మొట్టమొదటి సినిమాగా రికార్డులకు ఎక్కింది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో రెండో భాగం మీద ఫోకస్ పెంచారు మేకర్లు.

Kavya Thapar: అసిస్టెంట్ డైరెక్టర్ అలా అనేసరికి బిత్తర పోయా.. షాకింగ్ విషయం బయటపెట్టిన కావ్య

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి అవుతూ ఉండగా సాంగ్స్ మీద ఫోకస్ చేశారు. నవంబర్ 4వ తేదీ నుంచి ఐటెం సాంగ్ షూట్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొన్నాళ్ల క్రితం ప్రమోషన్స్ మొదలు పెడుతూ రిలీజ్ చేసిన టీజర్ కి ఏకంగా 150 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం టాలీవుడ్ హిస్టరీలోనే మొదటిసారి అంటూ సినిమా యూనిట్ అధికారికంగా తమ ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్ వంటి వాళ్ళు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

Exit mobile version