NTV Telugu Site icon

Pushpa2 : నేడు పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీస్ శాఖ

Pushpa2 (8)

Pushpa2 (8)

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిసున్న చిత్రం పుష్ప 2. నేడు హైదరాబాద్ లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర ఈవెంట్ నిర్వహిస్తున్నారు.  యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో నేడు సాయంత్రం 6 గంటల నుండి ఈవెంట్ మొదలుకానుంది. మూడేళ్ళ తర్వాత బన్నీ రిలీజ్ కానుండడంతో ఈవెంట్ కు భారీగా రానున్నారు అల్లు అర్జున్ ఫాన్స్. ఈ నేపథ్యంలో  యూసుఫ్ గూడలోని కేవిబిఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసుల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ ఈవెంట్ కు హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక  దర్శకుడు సుక్కు మరియు చిత్ర బృందం హాజరుకానుంది. డిసెంబర్ 5 వ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతున్న పుష్ప 2 సినిమా.

యూసూఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ ( కోట్ల విజయ భాస్కర రెడ్డి స్టేడియం ) నందు జరగబోయే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ దృష్ట్యా ట్రాఫిక్ మళ్లింపు వివరాలు.

1) అమీర్పేట నుండి జూబ్లీ చెక్ పోస్ట్ / మాదాపూర్ వైపు వెళ్లే వారు – యూసఫ్ గూడా బస్తీ వద్ద శ్రీనగర్ కాలనీ గుండా వెళ్ళవలెను

2) జూబ్లీ చెక్ పోస్ట్ నుండి యూసఫ్ గూడా వచ్చే వారు కృష్ణానగర్ – శ్రీనగర్ కాలనీ, పంజాగుట్ట వైపు నుండి

3) యూసఫ్ గూడా నుండి బోరబండ వైపు వెళ్ళేవారు కృష్ణకాంత్ పార్క్ – GTS టెంపుల్ మీదుగా వెళ్లవలెను.

పార్కింగ్ స్థలాలు:
1) కార్ల కొరకు –  సవేర మరియు మహమూద్ ఫంక్షన్ హాల్ నందు
2) బైక్స్ మరియు కార్ల కొరకు – జానకమ్మ తోట నందు

ట్రాఫిక్ మళ్లింపు మధ్యాహ్నం 3 గంటల నుండి కార్యక్రమం ముగిసే వరకు అమలులో ఉంటుంది. పై మార్గంలో ప్రయాణించే వారు తప్పనిసరిగా గమనించగలరని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Show comments