NTV Telugu Site icon

Pushpa2 : ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో తెలుసా..?

Pushpa 2

Pushpa 2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప – 2 పై భారీ అంచనాలు ఉన్నాయి. అటు బన్నీ అభిమానులు ఇటు సినీ ప్రియులు ఈ సినిమా కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనుకోని కారణాల వలన డిసెంబర్ 6న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. అందుకోసమై షూటింగ్ పనులు చక చక చేస్తున్నారు. లాంగ్ షెడ్యూల్ లో రెండు టీమ్స్ తో షూటింగ్ ను జెట్ స్పీడ్ లో చేస్తున్నాడు దర్శకుడు సుకుమార్.

Also Read : Tollywood : కొండా సురేఖ వ్యాఖ్యలపై ప్రభాస్, రామ్ చరణ్, విజయశాంతి రియాక్షన్

ఈ సినిమాకు సంబంధించి సెకండాఫ్ షూటింగ్ బాలన్స్ ను కంప్లిట్ చేస్తున్నారు, ఒక టీమ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో షూట్ చేస్తుండగా మరొక టీమ్ కాకినాడలో చేస్తుంది. ఇటీవల బన్నీ కాకినాడ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి పూర్తి కానుందని నిర్మాతరవిశంకర్ వారం క్రితం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ పై ద్రుష్టిపెట్టారు మేకర్స్. అందులో భాగంగా నవంబర్ రెండో వారంలో ట్రెయిలర్ రిలీజ్ కు ప్లానింగ్ జరుగుతోంది. అదే నెలలో ఈ సినిమాలోని 4 సాంగ్స్ లో క్లైమాక్స్ లో వచ్చే స్పెషల్ సాంగ్ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అలాగే ఐటం సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని రిలీజ్ కు కొద్దీ రోజుల ముందు ఆ పాటను రిలీజ్ చేయాలని చూస్తుంది యూనిట్. ఈ చిత్రంలో బన్నీ సరసన  రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీమేకర్స్ నిర్మించే ఈ భారీ బడ్జెట్ చిత్రానికి  దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

Show comments