ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సన్సేషనల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2′ . ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎదురుచూస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ రానే వచ్చింది. ఈ రోజు రాత్రి 9.30 గంటలకుస్పెషల్ ప్రీమియర్స్ తో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిగింల్ స్క్రీన్ థియేటర్స్ లో భారీ ఎత్తున ప్రీమియర్స్ ప్లాన్ చేసారు. ఇక నైజాంలోని అన్ని సింగిల్ థియేటర్స్ లో ప్రీమియర్స్ పడనునున్నాయి.
అల్లు అర్జున్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న పుష్పను అందరి కంటే ముందే చూడాలనే క్రేజ్ ఆడియెన్స్ లో విపరీతంగా ఉంది. ఆ ప్రభావం ప్రీమియర్ బుకింగ్స్ లో కనిపించింది. ప్రీమియర్ టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇంతటి భారీ రిలీజ్ అవుతున్న పుష్పపై అందరిలోను ఒకటే డౌట్ ఉంది. అదేమంటే పుష్ప -2 డే -1′ RRR’ రికార్డును బద్దలు కొట్టగలుగుతుందా లేదా అనేది ట్రేడ్ వర్గాలలో చర్చనీయాంశం గా మారింది. రాజామౌళి తెరకెక్కించిన RRR మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 223 కోట్లు రాబట్టి ఇండియా బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీ గా రికార్డు క్రియేట్ చేసింది. మరోవైపు ఇప్పటికే పుష్ప – 2 అడ్వాన్స్ బుకింగ్స్ రూ. 100 కోట్లు దాటేశాయి. ఇదే ఊపు మొదటి రోజు కూడా కొనసాగి రాజమౌళి సినిమాను బీట్ చేస్తుందని ఫ్యాన్స్ లెక్కలు కడుతున్నారు. దాదాపు 3.20 గంటల నిడివితో వస్తున్న పుష్ప -2 ఏ మేరకు ఆకట్టుకుంటుందో మొదటి రోజు ఏ మేరకు రాబడుతుందో అనే క్యూరియాసిటీ అటు ఫ్యాన్స్ లోను ఇటు ట్రేడ్ లోను ఉంది.