Site icon NTV Telugu

షూటింగ్ రీస్టార్ట్ చేసిన “పుష్ప” టీం

Pushpa

Pushpa

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా మూవీ “పుష్ప” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో స్టైలిష్ స్టార్ లారీ డ్రైవర్ పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న రొమాన్స్ చేయనుండగా… క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అల్లు అర్జున్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ తాజాగా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.

Read Also : సినీ ప్రియులకు గుడ్ న్యూస్… తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు రీఓపెన్…!

నేడు సికింద్రాబాద్ లోని సెట్ లో పుష్ప” టీం తిరిగి చిత్రీకరణను ప్రారంభించారు. అక్కడ 45 రోజుల పాటు ఈ షెడ్యూల్ కొనసాగనుంది. ఇందులోనే ప్రధాన నటీనటులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. ఈ షెడ్యూల్ లో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ కూడా పాల్గొనే అవకాశం ఉంది. 45 రోజుల పాటు నిరంతరాయంగా షూటింగ్ ను పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. తద్వారా రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ ను తొందరగా పూర్తి చేయాలన్నది వారి భావన. ఆ తరువాత అల్లు అర్జున్, తమిళ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్ లో ఓ మూవీ చేయనున్నాడని అంటున్నారు.

Exit mobile version