మీకు ఎప్పుడైనా థియేటర్లో.. సినిమా ఇచ్చే హైతో పోతామేమో అని అనిపించిందా? కానీ పుష్ప 2 సినిమా చూస్తున్నంత సేపు.. ఆ హైతో ఖచ్చితంగా పోతామనే ఫీలింగ్ మాత్రం కలగక మానదు. సుకుమార్ చేసిన మాస్ జాతరకు.. ఐకాన్ స్టార్ శివ తాండవం చేశాడు. గతంలో రాజమౌళి ఓ మాట చెప్పాడు. సుకుమార్ మాస్ సినిమా చేస్తే తట్టుకోలేమని, ఇప్పుడు పుష్ప2 చూస్తే రాజమౌళి మాటలు నూటికి నూరుపాళ్లు నిజం అనిపిస్తుంది. ఇక బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు థియేటర్లు తగలబడిపోయేలా ఉన్నాయి. చీర కట్టి అమ్మవారి వేషం వేసి ఆడినప్పుడు.. బాడీలో నరాలు కట్ అవుతాయేమో.. అని అనిపించకమానదు. అసలు ఓ సినిమాలో ఫ్రేమ్ టు ఫ్రేమ్ హై ఇవ్వడం సాధ్యమా? అంటే, అది కేవలం సుకుమార్, బన్నీ వల్ల మాత్రమే సాధ్యమనేలా చేశారు. పుష్ప పార్ట్ 1 సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం బ్రహ్మరథం పట్టారు.
Sree Leela: ఇది.. ‘కిస్సిక్’ అసలు కథ!
అందుకే.. సుకుమార్ పెరిగిన అంచనాలకు తగ్గకుండా సినిమా చేశాడు. అందుకుతగ్గట్టే.. నార్త్ మార్కెట్‌ని ఫోకస్ చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. ముందుగా బీహార్‌లో ప్రమోషన్స్ స్టార్ట్ చేసి.. హైదరాబాద్‌తో ఎండ్ చేశారు. ఫైనల్‌గా డిసెంబర్ 5న పీక్స్ ఆఫ్ ది హైప్‌తో థియేటర్లోకి వచ్చిన పుష్ప2.. ఆడియెన్స్ ఎక్స్‌పెక్టేషన్స్‌ను రీచ్ అవడంలో సక్సెస్ అయింది. ఈ సినిమాకు యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. తెలుగ, తమిళ్, మళయాళీ, కన్నడ సంగతేమో గానీ.. నార్త్ ఆడియెన్స్ మాత్రం పుష్పరాజ్ మాస్ జాతరకు కోట్ల వర్షం కురిపించడం గ్యారెంటీ. స్క్రీన్ పై బన్నీ చేసిన రపరప ఊచకోతకు.. ఖచ్చితంగా బాలీవుడ్ బాక్సాఫీస్ తగలబడిపోవడం గ్యారెంటీ. విడుదలైన అన్నీ భాషల్లోను ఈ సినిమా రికార్డ్ రేంజ్ వసూళ్లు చేసేలా ఉంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో వంద కోట్లు రాబట్టిన పుష్ప 2.. ప్రీమియర్స్ కలుపుకొని ఫస్ట్ డే అన్ని రికార్డులు బద్దలు కొట్టడం పక్కా. ఏదేమైనా.. సుకుమార్ మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో.. పుష్ప 2 జస్ట్ ఒక శాంపిల్ మాత్రమే. అసలు జాతర పుష్ప3లో ఉండనుంది. కానీ దానికి ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది.