NTV Telugu Site icon

Pushpa 2 : తగ్గేదేల్యా.. ట్రైలర్ లాంచ్ నార్త్ లోనే!

Pushpa (2)

Pushpa (2)

పుష్ప 2 మొదలుపెట్టినప్పటి నుంచి నార్త్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వచ్చిన సినిమా యూనిట్ ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా నార్త్ ఆడియన్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. పుష్ప 2 మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డిసెంబర్ 5వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతోంది. ఇక నార్త్ ఆడియన్స్ ని టార్గెట్గా చేసుకున్న ఈ సినిమా యూనిట్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పాట్నాలో నిర్వహించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17వ తేదీన పుష్ప ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. బీహార్ రాజధాని పాట్నాలో ఈ ట్రైలర్ లంచ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

Amaran: అమరన్ థియేటర్లకు పోలీసు భద్రత? ఎందుకంటే?

ఆ తర్వాత కలకత్తా, చెన్నై, కొచ్చి, బెంగళూరు, ముంబై, హైదరాబాదులలో ప్రత్యేకమైన ఈవెంట్స్ నిర్వహించబోతున్నట్లు కూడా పుష్ప 2 టీం ప్రకటించింది. బిగ్గెస్ట్ ఇండియన్ ఫిలిం కోసం మాసివ్ ఈవెంట్స్ లేనప్పుడు ఉన్నాయని వెల్లడిస్తూ ఒక వీడియోస్ సైతం రిలీజ్ చేసింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన హీరోయిన్గా రష్మిక మందన నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫహద్ ఫాసిల్, సునీల్, అనసూయ సహా అనేకమంది స్టార్ నటీనటులు భాగమైన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సుకుమార్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాని నార్త్ లో అనిల్ తడానికి చెందిన ఏ ఏ ఫిలిమ్స్ ఇండియా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.

Show comments