NTV Telugu Site icon

Pushpa -2 : ఇది సార్ ‘పుష్పరాజ్’ గాని బ్రాండ్..

Pushpa

Pushpa

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ సన్సేషనల్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఇండియన్ ఫిలిం ‘పుష్ప-2’ . టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్‌ భారీ బడ్జెట్ పై నిర్మించారు. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న పుష్ప 2 ప్రమోషన్స్ లో భాగంగా పుష్ప 2 ట్రైలర్ ను పాట్నాలో గ్రాండ్ గా విడుదల చేశారు మేకర్స్. తాజగా విడుదలైనా ట్రైలర్ అద్భుత స్పందన రాబట్టడమే కాకుండా మిలియన్ వ్యూస్ రాబడుతోంది.

Also Read : KCR : నేను ఎప్పుడు రోజాని ఏమీ అనలేదు : హైపర్ ఆది

ఇదిలా ఉండగా విడుదలకు ఇంకా 21 రోజులు ఉండగానే ఓవర్సీస్ లో పుష్ప గాడి రూలింగ్ స్టార్ట్ అయింది. ఈ సినిమా కు సంబంధించి ఓవర్సీస్ బుకింగ్స్ ఓపెన్ చేసారు. ఇప్పటి వరకు అత్యంత వేగంగా 1మిలియన్ అడ్వాన్స్ సేల్స్ రాబట్టిన ఆల్ టైమ్ ఇండియన్ సినిమాగా పుష్ప సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఇది ఓవర్సీస్ లోని తెలుగు సినిమాలలో ఒక రికార్డు. ఇక టికెట్స్ పరంగాను 35,000 టికెట్స్ బుక్ అయి రికార్డు క్రియేట్ చేసింది పుష్ప.  ఈ సినిమా ఓవర్సీస్ లో డిసెంబరు 4న రిలీజ్ కానుంది. అదే విధంగా ఓవర్సీస్ ప్రీమియర్స్ విషయంలోనూ పుష్ప రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు USAలో 3230 ప్రీమియర్స్ తో ఆల్ టైమ్ టాప్ – 3 గా నిలిచింది పుష్ప. మరోవైపు కెనడా లో పుష్ప బుకింగ్స్ ను ఓపెన్ చేశారు. ఇక్కడ కూడా రికార్డు బ్రేకింగ్ ప్రీమియర్స్ బుకింగ్స్ వచ్చే అవకాశం మెండుగా ఉంది. ఓవర్సీస్ లోను భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నారు మైత్రి మూవీ మేకర్స్.